- Telugu News Photo Gallery Cinema photos Prabhas Spirit to Nani Hit 3 latest movie updates from Tollywood film industry
Tollywood Updates: స్పిరిట్‌పై క్రేజీ న్యూస్ వైరల్.. ఘనంగా హిట్ 3 ట్రైలర్ ఈవెంట్..
మహేష్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్. జైలర్ 2 షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు సీనియర్ నటి. తారే జమీన్ పర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఆమిర్ ఖాన్ మూవీ సితారే జమీన్ పర్. స్పిరిట్ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్. అఖండ 2 ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం భారీ సెట్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Apr 15, 2025 | 4:07 PM

స్పిరిట్ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా కీలక పాత్రలో నటించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

మహేష్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు దేవాకట్ట డైలాగ్స్ రాశారు. గతంలో బాహుబలి సినిమాలో పాపులర్ అయిన 'ఏది మరణం డైలాగ్'ను రాసింది కూడా దేవా కట్టానే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేశారు రాజమౌళి.

అఖండ 2 ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం భారీ సెట్‌ను సిద్ధం చేశారు మేకర్స్. ఈ సెట్‌లో రెండు వారాల పాటు యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించబోతున్నారు. పీటర్ హెయిన్స్ ఈ యాక్షన్ సీన్‌ను కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. బాలయ్య అఘోర పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు. 2003లో రిలీజ్ అయిన ఈ సినిమాను ఇన్నేళ్ల తరువాత రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 26న ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రీ రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భూమిక హీరోయిన్‌గా నటించారు.

హిట్ 3 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్. వైజాగ్‌లోని సంఘం థియేటర్‌లో ఉదయం పదిన్నరకు కార్యక్రమం మొదలైంది. 11.07 నిమిషాలకు ట్రైలర్‌ను లాంచ్ చేసారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.





























