IPL 2025: RCB వద్దంది.. SRH ముద్దంది.. కావ్యపాప క్యాంప్‌లోకి మరో కాటేరమ్మ కొడుకు.. ఎవరంటే
ఐపీఎల్ 2025కి ముందు ఆర్‌సిబి తరపున ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడిన బ్యాట్స్‌మెన్ రవిచంద్రన్ స్మరాన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకుంది. ఈ 21 ఏళ్ల ఆటగాడిని కావ్య మారన్ ఎంతకు కొనుగోలు చేసిందో ఇప్పుడు ఈ వార్తలో చూసేద్దాం. ఆ వివరాలు..

ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఉన్న ఆటగాడు.. ప్రాక్టీస్ మ్యాచ్‌లలో సిక్సర్లు, ఫోర్లు కొట్టిన ఓ ప్లేయర్‌ను.. ఇప్పుడు కావ్య మారన్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగనున్నాడు. IPL 2025లో గాయపడిన ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో యువ ప్లేయర్ రవిచంద్రన్ స్మరాన్ ఎంపికయ్యాడు. కర్ణాటకకు చెందిన ఈ యువ బ్యాట్స్‌మెన్.. దేశీయ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
ఎవరీ రవిచంద్రన్ స్మరాన్..?
21 ఏళ్ల స్మరాన్ ఇప్పటివరకు ఏడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో అతడు 64.50 సగటుతో 500+ పరుగులు చేశాడు. పంజాబ్‌పై డబుల్ సెంచరీ సాధించడం గమనార్హం. 2024లో లిస్ట్ A క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి.. అతడు 10 మ్యాచ్‌ల్లో 72.16 సగటుతో రెండు సెంచరీలతో సహా 433 పరుగులు చేశాడు. అటు T20 ఫార్మాట్‌లోనూ తనదైన ముద్ర వేశాడు స్మరాన్. 6 మ్యాచ్‌ల్లో 170 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ 170. రవిచంద్రన్ స్మరాన్ మొదట RCB ప్రీ-క్యాంప్‌లో ప్రాక్టీస్ చేశాడు. అక్కడ అతడు 33 బంతుల్లో అజేయంగా 88 పరుగులు చేశాడు. కానీ తుది జట్టులో అవకాశం దక్కించుకోలేకపోయాడు.
ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ బ్యాట్స్‌మెన్‌ను సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి స్మరాన్ ఎంట్రీ స్పిన్నర్ స్థానంలో ఉండవచ్చు. కానీ అతడు బ్యాటింగ్ శైలి జట్టుకు కొత్త దూకుడును ఇస్తుంది. స్మరాన్‌ను రూ. 30 లక్షల బేస్ ధరకు జట్టులోకి తీసుకుంది కావ్య పాప. మరోవైపు, గాయం కారణంగా జట్టుకు దూరమైన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో యువ బ్యాట్స్‌మెన్ ఆయుష్ మాత్రేను ఎంపిక చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అతడ్ని 30 లక్షల రూపాయలకు జట్టులో చేర్చుకుంది.
Watch 🎥
R Smaran’s brilliant 101 (92) that helped Karnataka post 348/6 in the #Final against Vidarbha 💪💪#VijayHazareTrophy | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/ZZjfWXaajB pic.twitter.com/K1bmqDC5Ji
— BCCI Domestic (@BCCIdomestic) January 18, 2025
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..