ఎంత ముద్దుగా ఉందో..! అందాల ఐశ్వర్య మీనన్ లేటెస్ట్ ఫొటోస్
ఐశ్వర్యా మీనన్ ప్రధానంగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె 1989 మే 8న తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించింది, ఈ అమ్మడు పెరిగిందంతా చెన్నైలో.. ఆమె చెన్నైలోని SRM యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసింది. ఐశ్వర్యా తన నటనా జీవితాన్ని 2012లో కన్నడ చిత్రం దాసవాళాతో మొదలుపెట్టింది.
Updated on: Apr 15, 2025 | 1:56 PM

ఐశ్వర్యా మీనన్ ప్రధానంగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె 1989 మే 8న తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించింది, ఈ అమ్మడు పెరిగిందంతా చెన్నైలో.. ఆమె చెన్నైలోని SRM యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసింది.

ఐశ్వర్యా తన నటనా జీవితాన్ని 2012లో కన్నడ చిత్రం దాసవాళాతో మొదలుపెట్టింది. అయితే, ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రం 2013లో విడుదలైన తమిళ చిత్రం తమిళ్‌పడం 2.0. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నా రాఖీ కథ అనే సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది.

ఈ ముద్దుగుమ్మ నటనతో విభిన్న పాత్రల్లో నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళ్‌పడం 2.0లో ఆమె నటన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిన్నదానికి క్రేజీ సినిమా ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది.

2023లో ఐశ్వర్యా మీనన్ నటించిన తెలుగు చిత్రం స్పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన పొందింది. ప్రస్తుతం ఆమె తమిళం, తెలుగు చిత్రాల్లో కొన్ని కొత్త ప్రాజెక్టులపై పనిచేస్తుంది. ఈ చిన్నదాని అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

ఐశ్వర్యా సినిమాలతో పాటు కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలోనూ నటించింది. అలాగే థియేటర్‌లో కూడా పనిచేసింది. ఐశ్వర్యా మీనన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ చిన్నదాని ఫోటోలు వైరల్ అవుతుంది.





























