ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన భూకంపాలు ఇవే! వీటిని మించిన లేవు..
భూకంపం.. దీనిని ప్రకంపన అని కూడా పిలుస్తారు .ఇది భూ తరంగాలను సృష్టించే లిథోస్పియర్‌లో అకస్మాత్తుగా శక్తి విడుదల కావడం వల్ల భూమి ఉపరితలం కంపించడం. భూకంపాలు తీవ్రమైతే కీలకమైన మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తాయి. అలాగే నగరాల్లో విధ్వంసం సృష్టించగలవు. ఇప్పటవరుకు వచ్చిన ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన భూకంపాలు ఏంటో తెలుసుకుందాం..
Updated on: Aug 08, 2025 | 9:01 PM

1960లో చిలీలోని వాల్డివియాలో 9.5 తీవ్రతతో సంభవించిన భూకంపం 5,700 మంది మృతి చెందింది. మళ్లీ 2010లో చిలీలో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 28,000 మంది మరణించారు. దీని తర్వాత చిలీలో మరోసారి భూకంపం రాలేదు.

1946లో అమెరికాలోని అలూటియన్ దీవులలో 8.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 159 మంది మృతి చెందారు. అలాగే 1964లో అలాస్కాలో సంభవించింది. దీని తీవ్రత 9.3. దీని వల్ల 139 మంది మరణించారు. ఆ తర్వాత1965లో అమెరికాలోని రాట్ ఐలాండ్‌లో 8.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే పెద్దగా నష్టం కలిగించలేదు.

1952లో రష్యాలోని సెవెరో-కురిల్స్క్‌లో సంభవించిన భూకంపం తీవ్రత 9.0. దీని వల్ల 2,336 మంది మరణించారు. 2004న ఇండోనేషియాలోని సుమత్రాలో భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత 9.1. ఈ భూకంపం 2.28 లక్షల మందిని బలిగొంది. ఇది ఇండియాతో పాటు మరికొన్ని దేశాల్లో సునామీకి కారణం అయింది. ఇది ప్రపంచంలో అతి పెద్ద సునామీ.

1950లో అస్సాంలో 8.6 తీవ్రతతో భూకంపం సంభవించి 4,800 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత సరిగ్గా 62 సంవత్సరాల తర్వాత 2012లో హిందూ మహాసముద్రంలో 8.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. కానీ పెద్దగా నష్టం జరగలేదు.

2011లో జపాన్‌లోని తోహోకులో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం 19,750 మంది మృతి చెందారు. దీనికి ముందు జపాన్‌లో చాలా భూకంపాలు వచ్చినప్పటికీ.. ఇంత తీవ్రంగా రాలేదు. అలాగే ఇంతటి నష్టాన్ని మిగల్చలేదని చరిత్ర చెబుతుంది.




