- Telugu News Photo Gallery Morning Workout Tips: Is it good to exercise on an empty stomach in the morning? Know here
Morning Workout: ఉదయాన్నే ఖాళీ కడుపుతో మీరూ వ్యాయామం చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే..
చాలా మందికి ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటుంది. మరికొందరైతే అధికబరువును అదుపులో ఉంచుకోవడానికి ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే అధిక మంది ఉదయం పూట ఖాళీ కడుపుతో ఇలా వ్యాయామాలు చేస్తుంటారు. కిందరికి బాగానే ఉన్న ఒక్కోసారి ఇలా చేయడం తీవ్ర అలసటకు గురవుతుంటారు..
Updated on: Jan 12, 2025 | 3:06 PM

చాలా మంది ఉదయం పూట వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు. అయితే బరువు తగ్గడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కొంత మందికి కష్టమైన పని. కానీ సరైన మార్గనిర్దేశం లేకుండా ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల అనేక రకాల సమస్యలకు గురవుతుంటారు.

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే అనేక రకాల వ్యాయామాలు చేస్తూ, జిమ్‌కి వెళ్లి తమ శరీరాన్ని షేప్‌గా ఉంచుకుంటే అలాంటి సాధన మంచిది. నేటి జీవనశైలిలో ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి ఉదయాన్నే వ్యాయామం చేస్తే త్వరగా బరువు తగ్గుతారు. అయితే ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం మంచిదేనా? అనే సందేహం మీకూ ఎప్పుడైనా వచ్చిందా..

ఇలా ఖాళీ కడుపుతో వ్యాయామం చేయవచ్చా? వ్యాయామం ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇలా రకరకాల ప్రశ్నలు మీ మెదుడులో తలెత్తితే వాటికి ఈ కింద చక్కని పరిష్కారం చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..

రెగ్యులర్ వ్యాయామం చేసేవారు తరచుగా ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం సౌకర్యంగా ఉంటుంది. అయితే కొందరికి ఇది మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అందరి శరీరం, ఆహారపు అలవాట్లు ఒకేలా ఉండవు. కాబట్టి ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం మంచిది కాదు. ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది.

మీ బరువు తగ్గించే ప్రయాణంలో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును త్వరగా తగ్గించుకోవడం మంచిదే. కానీ ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే, గ్లైకోజెన్ నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని బలహీనపరచవచ్చు. అలాంటి సందర్భాలలో వ్యాయామం చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఉదయం పూట తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల వ్యాయామం చేయడం సులభం అవుతుంది. అలాగే మంచి ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.




