Sesame Oil: నూనెల్లో బెస్ట్ ఆయిల్ అంటే ఇదే.. ఎన్నో ఉపయోగాలు..

నువ్వుల నూనె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నువ్వుల నూనెతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వుల నూనెతో శరీరానికి మర్దనా చేసినా.. నువ్వుల నూనెతో వంటలు చేసినా వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

Chinni Enni

|

Updated on: Jan 12, 2025 | 3:10 PM

ఈ రోజుల్లో నూనెల్లో ఎన్నో రకాలు వచ్చాయి. అప్పట్లో మాత్రం ఎక్కువగా నువ్వుల నూనెను ఉపయోగించేవారు. వంటకు, శరీరానికి కూడా ఈ నూనెనే వాడేవారు. ఈ నూనెలో ఎన్నో పోషకాలు ఉంటాయి. నువ్వులను పవర్ హౌసెస్ అని అంటారు. ఆయుర్వేదంలో ఈ నూనెను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు.

1 / 5
పండుగలు వచ్చాయంటే చాలు.. నువ్వుల నూనె ఒంటి నిండా పట్టించి.. పిల్లలు, పెద్దలు స్నానం చేసేవారు. తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతికి కూడా నువ్వుల నూనెను రాసి తలంటు పోస్తారు. ఇప్పటికీ ఈ సంప్రదాయం పల్లెల్లో కొనసాగుతుంది.

2 / 5
నువ్వుల నూనె శరారీనికి పట్టించి మర్దనా చేయడం వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా తయారవుతుంది. చర్మాన్ని కాపాడటంలో నువ్వుల నూనె ఎంతో చక్కగా పని చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా మార్చుతాయి.

3 / 5
నువ్వుల నూనెతో మర్దనా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ అనేది చక్కగా జరుగుతుంది. దీంతో ఎన్నో రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. బ్రెయిన్‌ పని తీరు కూడా మెరుగు పడుతుంది. ఎముకలు, కండరాలు బలంగా మారతాయి.

నువ్వుల నూనెతో మర్దనా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ అనేది చక్కగా జరుగుతుంది. దీంతో ఎన్నో రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. బ్రెయిన్‌ పని తీరు కూడా మెరుగు పడుతుంది. ఎముకలు, కండరాలు బలంగా మారతాయి.

4 / 5
రక్త పోటును నియంత్రించడంలో కూడా ఈ నూనె ఎంతో హెల్ప్ చేస్తుంది. కీళ్ల నొప్పుల నివారణకు, రక్త నాళాలు సరిగా పనిచేసేలా, శ్వాస కోశ సమస్యలను తగ్గించడంలో కూడా ఈ నూనె హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్‌ని కూడా కంట్రోల్ చేయడంలో ఎంతో చక్కగా పని చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

రక్త పోటును నియంత్రించడంలో కూడా ఈ నూనె ఎంతో హెల్ప్ చేస్తుంది. కీళ్ల నొప్పుల నివారణకు, రక్త నాళాలు సరిగా పనిచేసేలా, శ్వాస కోశ సమస్యలను తగ్గించడంలో కూడా ఈ నూనె హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్‌ని కూడా కంట్రోల్ చేయడంలో ఎంతో చక్కగా పని చేస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us