Papaya & Banana: అరటి, బొప్పాయి కలిపి తిన్నారో.. బకెట్ తన్నాల్సిందే!

రోజువారీ ఆహారంలో తీసుకునే అరటిపండు, బొప్పాయి విడివిడిగా తింటే మంచిదే. అయితే రెండు కలిపి తిన్నారో యమ డేంజర్‌ అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రెండు అస్సలు కలిపి తినకూడదని హెచ్చరిస్తున్నారు. దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. అవేంటంటే..

Srilakshmi C

|

Updated on: Jan 12, 2025 | 2:28 PM

మనం రోజూ అనేక రకరకాల పండ్లను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కొన్ని ఆరోగ్యానికి మేలు చేసేవి ఉంటే.. మరికొన్ని హాని కలుగజేస్తాయి. అయితే కొన్ని రకాల పండ్లు కలిపి తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
ముఖ్యంగా అరటిపండు, బొప్పాయి అస్సలు కలిపి తినకూడదు. ఇది మన ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. నిజానికి, అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి కావలసిన అనేక పోషకాలు అందుతాయి. ఈ పండు శరీరానికి కావల్సిన పొటాషియం, క్యాల్షియంలను అందించి శరీర కండరాలను బలపరుస్తుంది. ఇక బొప్పాయిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఈ రెండు పండ్లు వాటి స్వంత లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ.. వీటిని కలిపి అస్సలు తినకూడదు.

2 / 5
అరటి, బొప్పాయి విభిన్న స్వభావం కలిగిన పండ్లు. అందుకే వీటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. వీటిని కలిపి తినడం వల్ల వాంతులు, అలర్జీ, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి బొప్పాయి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అరటిపండు, బొప్పాయి కలిపి తినడం వల్ల ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

3 / 5
అలాగే జాండిస్‌తో బాధపడేవారు బొప్పాయి తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇందులోని పపైన్, బీటా కెరోటిన్ జాండిస్ సమస్యను తీవ్రతరం చేస్తాయి. అలాగే శరీరంలో పొటాషియం ఎక్కువగా ఉన్నవారు కూడా అరటిపండ్లు తినకూడదు.

4 / 5
కాబట్టి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే బొప్పాయి, అరటిపండు విడివిడిగా తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం అరటిపండు శరీరాన్ని చల్లబరుస్తుంది. బొప్పాయి శరీరాన్ని వేడి చేస్తుంది. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ పాడైపోయి తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, అలర్జీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

5 / 5
Follow us