Peanut Butter Effects: పీనట్ బటర్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్.. ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ తెలుసా..
చాలా మంది ఎంతో ఇష్ట పడి తినే వాటిల్లో పీనట్ బటర్ కూడా ఒకటి. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో బ్రెడ్ మీద పీనట్ బటర్ లేదా జామ్ రాసుకుని తింటూ ఉంటారు. రాత్రి డిన్నర్‌గా కూడా చాలా మంది దీన్నే తినేసి పడుకుంటారు. దీని వల్ల సమయం కూడా సేవ్ అవుతుంది. అంతే కాకుండా.. పీనట్ బటర్‌లో మంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ వంటివి ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదే అయినా దీంతో కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్..
Updated on: Mar 20, 2024 | 6:53 PM

చాలా మంది ఎంతో ఇష్ట పడి తినే వాటిల్లో పీనట్ బటర్ కూడా ఒకటి. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో బ్రెడ్ మీద పీనట్ బటర్ లేదా జామ్ రాసుకుని తింటూ ఉంటారు. రాత్రి డిన్నర్‌గా కూడా చాలా మంది దీన్నే తినేసి పడుకుంటారు. దీని వల్ల సమయం కూడా సేవ్ అవుతుంది.

అంతే కాకుండా.. పీనట్ బటర్‌లో మంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ వంటివి ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదే అయినా దీంతో కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

పీనట్ బటర్ అనేది రుచిగా ఉంటుంది. దీన్ని అతిగా పిల్లలు, పెద్దలు తినడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో నొప్పి, మల బద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే కొంత మందికి ఇది పడకపోవచ్చు. దీంతో అలెర్జీ సమస్యలు రావచ్చు.

దురద, దద్దుర్లు, శ్వాస సమస్యలు, గుండె సమస్యలు, స్పృహ కోల్పోవడం, వికారం, వాంతులు, అజీర్ణం సమస్యలు రావచ్చు. ఇంకొంత మందిలో నోటిలోని పుండ్లు రావడానికి కూడా ఛాన్స్ ఉంది.

పీనట్ బటర్‌లో ఉప్పు శాతం అధికంగా ఉండటం వల్ల.. బీపీ ఉన్నవారికి ప్రమాదం. అలాగే పీనట్ బటర్‌లోని చిన్న చిన్న ముక్కలు ఊపిరి తిత్తుల్లోకి వెళ్లి.. ఊపిరి తీసుకునే మార్గాలు కూడా మూసుకు పోవచ్చు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.




