- Telugu News Photo Gallery Do you have an aquarium at home? Do you know how many colorful fish should be in it?
Vastu Tips: ఇంట్లో అక్వేరియం ఉందా.. ఇందులో ఎన్ని రంగుల చేపలు ఉండాలో తెలుసా?
చాలా మంది ఇళ్లల్లో అక్వేరియం ఉంటుంది. అందం కోసం లేదా వాస్తు శాస్త్రం ప్రకారం కూడా అక్వేరియాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇంట్లో అక్వేరియం ఉండటం వలన పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఈ అక్వేరియంలో రంగు రంగుల చేపలను కూడా ఉంచుతారు. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఫిష్ ట్యాంక్‌ను ఇంట్లో పెట్టుకోవడానికి కొన్ని నియమాలు ఉండాలి. దీన్ని సరైన దిశలో పెట్టుకోవడం వల్ల.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం తగ్గుతుంది. అంతే కాకుండా ఇంట్లోని కుటుంబ సభ్యుల..
Updated on: Mar 20, 2024 | 7:01 PM

చాలా మంది ఇళ్లల్లో అక్వేరియం ఉంటుంది. అందం కోసం లేదా వాస్తు శాస్త్రం ప్రకారం కూడా అక్వేరియాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇంట్లో అక్వేరియం ఉండటం వలన పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఈ అక్వేరియంలో రంగు రంగుల చేపలను కూడా ఉంచుతారు. చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

కానీ ఫిష్ ట్యాంక్‌ను ఇంట్లో పెట్టుకోవడానికి కొన్ని నియమాలు ఉండాలి. దీన్ని సరైన దిశలో పెట్టుకోవడం వల్ల.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం తగ్గుతుంది. అంతే కాకుండా ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే చాలా మంది అక్వేరియాన్ని ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు.

ప్రధాన ద్వారం ఎడమ వూపు అక్వేరియం పెట్టడం వల్ల దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. అక్వేరియాన్ని బెడ్ రూమ్ లేదా కిచెన్‌లో అస్సలు పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ధన నష్టం, వైవాహిక జీవితంలో గొడవలకు దారి తీస్తుంది.

అక్వేరియంలోని చేపలకు ఆహారం అందించడం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం.. డబ్బు సంక్షోభం నుంచి బయట పడొచ్చు. అలాగే ఫిష్ ట్యాంక్‌ని దీర్ఘవృత్తాకారంలో ఉన్న ఫిష్ ట్యాంక్‌ను ఎంచుకోవాలి. అక్వేరియంలో చేపలు తిరగడానికి వీలుగా ప్లేస్ ఉండాలి.

అలాగే ఫిష్ ట్యాంక్‌లో 9 లేదా ఐదు లేదా ఒక చేపనైనా పెంచుకోవచ్చు. ఈ చేపల్లో ఒకటి మాత్రమే బ్లాక్ ఫిష్.. మిగతావి గోల్డ్ కలర్ చేపలు ఉండాలి. ఇలా ఉండటం వల్ల.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు.




