- Telugu News Photo Gallery So many Health Benefits in Seema Chintakayalu, check here is details in Telugu
Seema Chintakaya Benefits: సీమ చింతకాయతో ఎన్ని హెల్త్ బెనిఫిట్సో తెలుసా.. డోంట్ మిస్!
సీమ చింత కాయలు అంటే సిటీలో ఉండే వారి కంటే.. పల్లెటూరులో ఉండే వారికి బాగా తెలుస్తుంది. వీటినే గుబ్బ కాయలు అని కూడా పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి చిక్కుడు కాయల్లా.. కాకపోతే గింజలు పెద్దగా ఉంటాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. ఇవి ఎక్కువగా వేసవి కాలంలో మాత్రమే..
Updated on: Mar 20, 2024 | 7:17 PM

సీమ చింత కాయలు అంటే సిటీలో ఉండే వారి కంటే.. పల్లెటూరులో ఉండే వారికి బాగా తెలుస్తుంది. వీటినే గుబ్బ కాయలు అని కూడా పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి చిక్కుడు కాయల్లా.. కాకపోతే గింజలు పెద్దగా ఉంటాయి.

తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. ఇవి ఎక్కువగా వేసవి కాలంలో మాత్రమే లభ్యమవుతాయి. ఇది కాస్త వగరుగా, తియ్యాగా ఉంటాయి. వీటిని తింటే ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది.

సీమ చింతకాయల్లో ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, బి, సి వంటివి పుష్కలంగా లభ్యమవుతాయి. షుగర్, బీపీ ఉన్నవారు కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా వీటిని నేరుగా తినొచ్చు.

వీటిని తినడం వల్ల కీళ్ల నొప్పులు, సీజనల్ వ్యాధులు, మల బద్ధకం, జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అదే విధంగా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు కూడా రావు.

వీటిని ఎలాగైనా తీసుకోవచ్చు. నేరుగా పచ్చివి తిన్నా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని పచ్చళ్ల రూపంలో కూడా తీసుకుంటారు. కూరల్లో కూడా వేసుకుంటారు. అలాగే వేయించి, పొడి చేసుకుని నీటితో కలిపి తీసుకుంటారు.




