ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 కోసం అన్ని జట్లు కొత్త జెర్సీలను ఆవిష్కరించాయి. ఈ పది జట్లలో చాలా వరకు జట్లు మునుపటి జెర్సీ రంగులోనే కొనసాగాయి. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు మాత్రమే తమ జెర్సీ డిజైన్‌లలో గణనీయమైన మార్పును చేశాయి. వీటిలో కొన్ని బాగున్నాయని, మరికొన్ని బాగోలేవంటూ క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఐపీఎల్ 2024 సీజన్ లో మీకు ఏ టీమ్ జెర్సీ నచ్చింది?