- Telugu News Photo Gallery Make sure that these items do not fall down even by mistake in the kitchen, check here is details
Vastu Tips: వంట గదిలో పొరపాటున కూడా ఈ వస్తువులు కింద పడకుండా చూసుకోండి!
ప్రతీ ఇంట్లో వంట గదికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వంట గదిని ఎంతో శుభ్రంగా ఉంచుతూ ఉంటారు. ఎందుకంటే ఇంటి సభ్యుల ఆరోగ్యం.. వంటగదిపైనే ఆధార పడి ఉంటుంది. అయితే ఒక్కోసారి వంట గదిలోని వస్తువులు జారి పడిపోతూ ఉంటాయి. అందులోనూ కొన్ని రకాల వస్తువులు అస్సలు జారి పడిపోకుండా చూసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో కింద పడకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. వీటిల్లో గాజు పాత్రలు కూడా..
Updated on: May 16, 2024 | 5:34 PM

ప్రతీ ఇంట్లో వంట గదికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వంట గదిని ఎంతో శుభ్రంగా ఉంచుతూ ఉంటారు. ఎందుకంటే ఇంటి సభ్యుల ఆరోగ్యం.. వంటగదిపైనే ఆధార పడి ఉంటుంది. అయితే ఒక్కోసారి వంట గదిలోని వస్తువులు జారి పడిపోతూ ఉంటాయి. అందులోనూ కొన్ని రకాల వస్తువులు అస్సలు జారి పడిపోకుండా చూసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో కింద పడకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. వీటిల్లో గాజు పాత్రలు కూడా ఒకటి. చాలా మంది ఇప్పుడు వంటింట్లో గాజు పాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి జారి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

అదే విధంగా పాలు కూడా కింద పడకుండా చూసుకోవాలి. పాలు కింద జారి పడిపోవడాన్ని వాస్తు శాస్త్రం దోషంగా పరిగణిస్తుంది. అలాగే పాలు కూడా పొంగి.. కింద పడిపోకుండా చూసుకోవాలి. వీటి వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి.

వంటగదిలో పడకూడదని వస్తువుల్లో ఉప్పు కూడా ఒకటి. ఉప్పు కూడా ఎట్టి పరిస్థితుల్లో కింద పడకుండా చూడండి. ఉప్పుని లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా భావిస్తారు. అలాగే ఉప్పుకు, చంద్రునితో కూడా లింక్ ఉంది. ఉప్పు కింద పడిపోతే ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి.

వాస్తు ప్రకారం నూనె కూడా కింద పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నూనెకు శని దేవుడికి సంబంధం కలిగి ఉంటుంది. నూనె కింద పడిపోవడం వల్ల ఇంట్లో పలు ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుందట.




