- Telugu News Photo Gallery Maha Kumbh Mela 2025: cheapest ashrams and dharamshala in prayagraj Uttar Pradesh
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు వెళ్తున్నారా.. ప్రయాగ్ రాజ్‌లో బస చేసేందుకు బెస్ట్ ఆశ్రమాలు.. తక్కువ ధరకే లభ్యం..
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జాతరకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. హిందూ మత విశ్వాసాలకు కేంద్రంగా భావించే మహా కుంభామేళా సందర్భంగా లక్షలాది మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. మీరు కూడా మహాకుంభమేళాకు వెళుతున్నట్లయితే.. అక్కడ బస చేయడానికి చౌకైన స్థలాల గురించి తెలుసుకోవాల్సిందే..
Updated on: Nov 30, 2024 | 12:53 PM

జనవరి 2025 నెలలో మహా కుంభమేళా నిర్వహించనున్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళా ఈసారి ప్రయాగ్‌రాజ్ తీర్థంలో నిర్వహించనున్నారు. కుంభమేళా జాతరకు కోట్లాది మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. త్రివేణీసంగమం ప్రయాగ్‌రాజ్ నగరంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహిస్తున్నారు.

మహాకుంభమేళాకు వెళ్లాలనుకునేవారు ముందుగా కొన్ని సన్నాహాలు చేసుకోవాలి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మహా కుంభమేళాకు వెళ్ళేవారు బస చేసే విషయం ముందుగానే తెలుసుకోవాలి. లేదంటే అక్కడ బస చేసేందుకు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. ఈ మహా కుంభమేళాకు ఎక్కువ మంది రావడంతో హోటళ్లు కూడా ఖరీదైనవిగా మారతాయి. అయితే బడ్జెట్ కారణంగా కొందరు ఆశ్రమం లేదా ధర్మశాలలో నివసించడానికి ఇష్టపడతారు. కనుక అక్కడ ఉన్న కొన్ని ధర్మశాలలు, ఆశ్రమం గురించి తెలుసుకుందాం. ఇక్కడ తక్కువ డబ్బుతో కూడా ఉండగలిగే అన్ని సదుపాయాలు ఉంటాయి

భరద్వాజ ఆశ్రమం: ప్రయాగ్‌రాజ్‌లోని ఏదైనా హోటల్‌లో ఉండకంటే ఆశ్రమం లో ఉండడం బెస్ట్ అని అనుకుంటే.. భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళవచ్చు. ఈ ఆశ్రమం ప్రయగ్ రాజ్ లోని పురాతన ప్రదేశాలలో ఒకటి. ఈ స్థలంలో రూ. 500-1000 మధ్య గదులు లభిస్తాయి. ఇక్కడ AC , నాన్-AC రెండు గదులు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు తమ సౌలభ్యం, బడ్జెట్ ప్రకారం గదిని బుక్ చేసుకోవచ్చు. ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆశ్రమం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జైన ధర్మశాల: ధర్మశాలలో ఉండాలని ఆలోచిస్తున్నట్లయితే జైన ధర్మశాలకు వెళ్లవచ్చు. ఇక్కడ తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ రెండు పడకల గది సుమారు రూ. 500 నుంచి రూ. 1500 వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ ధర్మశాలలో 2 పడకల నాన్ AC గదికి అద్దె దాదాపు రూ. 600. ఈ ధర్మశాల అజంతా సినిమా థియేటర్ సమీపంలోని చాంద్ జీరో రోడ్డులో ఉంది.

భారత సేవా ఆశ్రమం: ఈ ఆశ్రమం కూడా బడ్జెట్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రయాగ్‌రాజ్ స్టేషన్ నుంచి ఈ ఆశ్రమ దూరం దాదాపు 8 కిలోమీటర్లు. ఇక్కడ చాలా మంది తమ గదులను ముందుగానే బుక్ చేసుకుంటారు. ఈ ఆశ్రమంలో చాలా తక్కువ ఖర్చుతో సింగిల్ రూమ్ నుంచి డబుల్ రూమ్, సింగిల్ బెడ్ నుంచి డబుల్ బెడ్ వరకు బుక్ చేసుకోవచ్చు. విశేషమేమిటంటే ఇక్కడ వైఫై సౌకర్యం కూడా ఉంది. ఈ తులారామ్ బాగ్ MG రోడ్డులో ఉంది.




