- Telugu News Photo Gallery Low Back Pain Coping Tips: How to deal with back pain from sitting too long
Low Back Pain: బ్యాక్ పెయిన్‌తో ఆషామాషీ కాదు.. నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం!
పని ఒత్తిడి వల్ల చాలా మంది ఆఫీస్‌లో ఎంతసేపు కుర్చీలో కూర్చున్నారో కూడా గమనించకుండా వర్క్‌లో మునిగిపోతుంటారు. క్రమంగా ఈ అలవాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం, ఎక్కువసేపు నిలబడి పనిచేయడం వల్ల కూడా వెన్నునొప్పి, నడుము నొప్పి సమస్య వస్తుంది..
Updated on: Jan 28, 2025 | 1:57 PM

రోజూ ఆఫీసుకు వెళ్లేవారు సమయం తెలియకుండానే పనిలో మునిగిపోతుంటారు. పని ఒత్తిడి వల్ల ఎంతసేపు కుర్చీలో కూర్చున్నారో కూడా చాలా మంది గమనించరు. క్రమంగా ఈ అలవాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందులో విపరీతమైన అసౌకర్యం, వెన్నునొప్పి ముఖ్యమైనవి. అనేక కారణాల వల్ల ఈ సమస్య రావచ్చు. ఎక్కువ సేపు కూర్చోవడం, ఎక్కువసేపు నిలబడి పనిచేయడం వల్ల కూడా వెన్నునొప్పి, నడుము నొప్పి వస్తుంది. అలాగే చాలా మంది ఆఫీసు కుర్చీల్లో గంటల తరబడి కూర్చుంటారు. వారి భంగిమ సరిగ్గా ఉండకపోయినా ఆకస్మిక వెన్ను, నడుము నొప్పికి కారణమవుతుంది. కొంతమంది దానిని పెద్దగా పట్టించుకోరు. అయితే ఇది మనం చేసే అతి పెద్ద తప్పు. కాబట్టి ఈ వెన్నునొప్పిని ఎలా నివారించాలి? పరిష్కారం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా వెన్నునొప్పి ప్రారంభమైన రెండు మూడు రోజులలోపు తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఈ సమస్యతో బాధపడేవారు వీలైనంత త్వరగా వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. వెన్నునొప్పి త్వరగా తగ్గడానికి వైద్యులు మందులు సూచిస్తారు. అదనంగా, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వెన్నునొప్పిని సులభంగా తగ్గించవచ్చు.

వెన్ను, నడుము నొప్పితో బాధపడేవారు కొన్ని సాధారణ యోగాసనాలు వేయడం ప్రారంభించాలి. ఇవి ఈ రకమైన సమస్యను సులభంగా పరిష్కరిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెన్నునొప్పి ఏదైనా గాయం కారణంగా ఉంటే, ఐస్ కోల్డ్ కంప్రెస్ సహాయం చేస్తుంది. రక్తం గడ్డకట్టడం వంటివి ఉంటే వేడి కంప్రెస్ ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. అయితే దీన్ని ప్రయత్నించే ముందు వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు.

ఆఫీసులో ఒకే చోట కూర్చొని నిరంతరం పని చేస్తే వెన్ను, నడుము నొప్పి త్వరగా రావచ్చు. చాలా మంది ఎంతసేపు కూర్చున్నారో కూడా పట్టించుకోరు. కుర్చీలో కూర్చోవడం, కూర్చుని నిద్రపోవడం కూడా తుంటిపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజూ సరిపడా నిద్రపోవాలి. అలాగే కుర్చీపై కూర్చున్నప్పుడు మీ వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.

ఈ రకమైన అభ్యాసం శరీరంలోని వివిధ భాగాలలో నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాకుండా, అనేక అధ్యయనాలు మానసిక ఒత్తిడి, నిరాశ మధ్య సంబంధాన్ని బలపరుస్తున్నాయి. కాబట్టి మీరు శారీరక నొప్పిని నివారించాలనుకుంటే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.





























