కల్తీ ఖర్జూరాలు తింటున్నారా? ఇలా సులువుగా గుర్తించండి..

02 March 2025

TV9 Telugu

TV9 Telugu

పిల్లలూ పెద్దలూ అందరికీ నచ్చే ఆహారం ఖర్జూరపండ్లు. ఇవి రుచిగా ఉండటమే కాదు బలాన్నిస్తాయి. అంతకుమించి తేలిగ్గా జీర్ణమవుతాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్స్‌ అనేక రోగాల బారి నుంచి కాపాడతాయి. ఇవి మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తాయి

TV9 Telugu

ముఖ్యంగా రంజాన్ మాసంలో ఉపవాసం ఖర్జూరంతో విరమించడం అందరికీ తెలిసిందే. దీని వెనుక మత విశ్వాసం మాత్రమే కాదు, ఆరోగ్య దృక్కోణం కూడా దాగి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

ఖర్జూరంలో కాల్షియం, బి-6, సి విటమిన్లు పీచు, ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఫొలేట్, మాంగనీస్, ఐరన్‌, బి కాంప్లెక్స్, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

రంజాన్ మాసంలో కొందరు లాభాలకు కక్కుర్తిపడి నాణ్యత లేని ఖర్జూరాలను బెల్లం, చక్కెర వంటి వాటిలో ఉడికించి అమ్ముతారు. ఇలాంటి కల్తీ ఖర్జూరాలను ఎలా గుర్తించాలంటే..

TV9 Telugu

నీటిలో ఖర్జూరాలు వేసి, వాటి క్యాలిటీ తనిఖీ చేయవచ్చు. నిజమైన ఖర్జూరాలు వాటి రంగును కోల్పోవు. అయితే బెల్లం పూసిన ఖర్జూరాలు పరిమాణం తగ్గడమేకాదు. మలినాలు నీటిలో కరిగిపోతాయి

TV9 Telugu

ఖర్జూరాలు తినేటప్పుడు చాలా తియ్యగా అనిపిస్తే, అవి కల్తీ అని అర్ధం చేసుకోవాలి. అయితే నిజమైన ఖర్జూరాలు లోపల గుజ్జుగా ఉండటం వల్ల సహజమైన తీపి కారణంగా తియ్యగా ఉంటాయి

TV9 Telugu

నిజమైన ఖర్జూరాలు ముట్టుకోవడానికి జిగురుగా ఉండవు. అయితే కల్తీ చేసిన ఖర్జూరాలు ముట్టుకుంటే చాలా జిగురుగా ఉంటాయి. వాటిపై చక్కెర లేదా బెల్లం పూత ఉండటమే అందుకు కారణం

TV9 Telugu

మంచి నాణ్యత గల ఖర్జూరం సువాసన చాలా ఆహ్లాదకరంగా, సహజమైన తీపితో నిండి ఉంటుంది. అయితే కల్తీ ఖర్జూరం వాసన ఇందుకు విభిన్నంగా, వెగటుగా ఉంటుంది