- Telugu News Photo Gallery Cinema photos Do You Remember This Heroine Who Acted In Satyadev Uma Maheswara Ugra Roopasya Movie, She is Roopa Koduvayur
Tollywood: అరెరె.. ఈ హీరోయిన్ ఎంతగా మారిపోయింది.. డాక్టర్ జాబ్ చేస్తూ సినిమాల్లో..
తెలుగులో కేవలం ఒక్క సినిమానే చేసింది. కానీ అడియన్స్ మనసులు గెలుచుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మరోవైపు డాక్టర్ గా విధులు నిర్వహిస్తుంది. అయితే ఆమెకు తెలుగులో అనుకున్నంత క్రేజ్ రాలేదు. దీంతో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ సైతం రావట్లేదు. కానీ నెట్టింట చాలా యాక్టివ్.
Updated on: Mar 02, 2025 | 8:20 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? తెలుగులో ఆమె నటించిన సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ ఆ బ్యూటీకి మాత్రం అంతగా క్రేజ్ రాలేదు. దీంతో అటు ఆఫర్స్ కూడా అంతగా అందుకోలేకపోయింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా..?

ఆమె పేరు రూప కొడువాయూర్. అచ్చ తెలుగమ్మాయి. టాలీవుడ్ హీరో సత్యదేవ్ సరసన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఇందులో నటిగా ప్రశంసలు అందుకున్నప్పటికీ అంతగా గుర్తింపు మాత్రం రాలేదు.

ఆ తర్వాత బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. ఈసినిమాతో రూప ఫేమస్ అయ్యింది. కానీ తెలుగులో ఆఫర్స్ అందుకోలేదు. ఈ బ్యూటీకి తమిళం నుంచి వరుస అవకాశాలు వచ్చాయి.

రూప కేవలం నటిగానే కాదు.. డాక్టర్ కూడా. అలాగే ఆమె మంచి డ్యాన్సర్. అటు డాక్టర్ గా వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు కథానాయికగా మెప్పిస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్.

నెట్టింట నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ లుక్స్ తో కాఫీ కప్పుతో ఫోటోలకు ఫోజులిచ్చింది.




