- Telugu News Photo Gallery Cinema photos If you know the value of Kajal Aggarwal's assets, you will have a mind block.
Kajal Aggarwal: కాజల్ ఆస్తులు విలువ ఎంత.? తెలిస్తే మైండ్ బ్లాక్..
కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సీనియర్ అండ్ స్టార్ హీరోల నుంచి జూనియర్ హీరోలందరితోనూ నటించి ఆకట్టుకుంది. పెళ్లైన కూడా ఇంకా సినిమాలు చేస్తూ అలరిస్తోంది.
Updated on: Mar 02, 2025 | 7:50 PM

కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సీనియర్ అండ్ స్టార్ హీరోల నుంచి జూనియర్ హీరోలందరితోనూ నటించి ఆకట్టుకుంది. పెళ్లైన కూడా ఇంకా సినిమాలు చేస్తూ అలరిస్తోంది.

1985లో జూన్ 19న పంజాబీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ముంబయిలో జన్మించింది కాజల్ అగర్వాల్. స్కూలింగ్ ముంబలోనే చేసింది. సెయింట్ ఆన్స్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసింది. ఆ తర్వాత జై హింద్ కళాశాలలో ఇంటర్, అనంతరం మాస్ మీడియాలో గ్రాడ్యూవేషన్ చదివింది.

క్యూన్ హో గయా నా(2004) చిత్రంతో అరంగేట్రం చేసిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత 2007లో 'లక్ష్మి కళ్యాణం'(2007) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇంగ్లీష్ మీడియా కథనాల ప్రకారం కాజల్ అగర్వాల్ నెట్ వర్త్ రూ.67 కోట్ల వరకు ఉండొచ్చట.

కొన్ని వెబ్సైట్లలో ఆమె దగ్గర ఉన్న ఆస్తులు రూ.90కోట్ల వరకు ఉండొచ్చని అంచన. ఆమె ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.2 నుంచి రూ.4 కోట్ల వరకు తీసుకుంటోందని తెలుస్తోంది. ముంబయిలో రూ.6 కోట్ల విలువ గల లగ్జరీ బంగలా ఉందట.

ఆమె దగ్గర ఖరీదైన విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. ఆడీ ఏ4, రేంజ్ రోవర్, స్కోడా అక్టావియా ఉన్నాయట. అలానే ఆమెకు బ్యూటీ ప్రొడక్ట్స్ కు సంబంధించిన కంపెనీ కూడా ఉందట.




