Sadhguru’s Meditation App: చాట్‌జిపిటిని అధిగమించిన సద్గురు ‘మిరాకిల్ ఆఫ్ మైండ్’.. 15 గంటల్లో 1 మిలియన్ డౌన్‌లోడ్‌లు
Miracle of Mind App: ఆధ్యాత్మిక గురువు సద్గురు ప్రారంభించిన ఉచిత ధ్యాన యాప్ మిరాకిల్ ఆఫ్ మైండ్ కేవలం 15 గంటల్లోనే 1 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటింది. ఇది చాట్‌జిపిటిని సైతం అధిగమించింది. జీవిత ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి మీరు గంటల తరబడి ధ్యానం చేస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు..

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ కొత్తగా ప్రారంభించిన ఉచిత ధ్యాన యాప్ ‘మిరాకిల్ ఆఫ్ మైండ్’ కొత్త చరిత్ర సృష్టించింది. శివరాత్రి నాడు విడుదలైన ఈ మొబైల్ అప్లికేషన్‌ను కేవలం 15 గంటల్లోనే 1 మిలియన్ మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీనితో ‘మిరాకిల్ ఆఫ్ మైండ్’ యాప్ ChatGPTని అధిగమించింది.
మహాశివరాత్రి (ఫిబ్రవరి 26) నాడు ప్రారంభించబడిన ఈ యాప్ ఇప్పుడు భారతదేశం, అమెరికా, కెనడా, UK, ఆస్ట్రేలియా, జర్మనీతో సహా 20 దేశాలలో ట్రెండింగ్‌లో ఉంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, రష్యన్, స్పానిష్ భాషలలో లభించే మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునే లక్ష్యంతో AI- ఆధారిత ఫీచర్‌తో ప్రవేశపెట్టారు.
It is expected that by 2050, about 30-33% of the world’s population would be mentally ill. This is because we always think that solutions to our challenges are outside of us. All the solutions are within us, but we have no “Inward access.” The Miracle of Mind app will teach you… pic.twitter.com/Q5h0JSwj7U
— Sadhguru (@SadhguruJV) February 27, 2025
జీవిత ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి మీరు గంటల తరబడి ధ్యానం చేస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఈ యాప్ కేవలం ఏడు నిమిషాల్లో మీ మనసును ప్రశాంతపరుస్తుంది. ఈ యాప్‌లో సద్గురు బోధనలతో పాటు పూర్తి ధ్యాన సమాచారాన్ని అందించే AI-ఆధారిత ఇంటెలిజెన్స్ సాధనం ఉంటుందని చెబుతున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




