యాలకుల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపు చేస్తాయంటున్నాయి పలు అధ్యయనాలు. క్యాన్సర్ కారక కణాలు పెరగకుండానూ అడ్డుకుంటాయట
TV9 Telugu
ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. అన్నం తిన్నాక రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే చాలు... ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. వీటిలోని ఔషధ గుణాలు బ్యాక్టీరియాతో పోరాడతాయి
TV9 Telugu
మెటబాలిజం రేటుని మెరుగు పరుస్తాయి. నోటి దుర్వాసన తగ్గిస్తాయి. యాలకుల్ని ఆహారంలో భాగం చేసుకుంటే... శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. యాలకుల్లో ఉండే కీలక విటమిన్లు, ఫైటో న్యూట్రియంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్... జుట్టుని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపించి... మెరిసిపోయేలా చేస్తాయి
TV9 Telugu
వంటగదిలో లభించే ఈ సుగంధ ద్రవ్యంలో సోడియం, పొటాషియం, ఐరన్, ప్రోటీన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి
TV9 Telugu
అయితే ఆరోగ్యానికి మంచిది కదాని ఎక్కువగా యాలకులు తింటే మాత్రం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు యాలకులు తినడం మానుకోవాలి
TV9 Telugu
యాలకులు వేడి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి. అందువలన గర్భధారణ సమయంలో వీటిని తినడం మానేయడం మంచిది
TV9 Telugu
సున్నితమైన చర్మం ఉన్నవారు యాలకులు ఎక్కువగా తినకూడదు. కొన్నిసార్లు ఎక్కువగా వీటిని తినడం వల్ల కూడా చర్మంపై దద్దుర్లు ఏర్పడి, మచ్చలు వస్తాయి