కాలేయం రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్‌లను తయారు చేస్తుంది. కాలేయం జీవక్రియ సరిగ్గా జరగకపోతే, దాని పనితీరు బలహీనంగా ఉంటే రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్లు ఉత్పత్తి చేయదు. ఫలితంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు చిన్న గాయాలు తగిలినా ఆగకుండా రక్తస్రావం అవుతుంది. కాలేయం వ్యాధి ఉంటే జీవక్రియ సరిగ్గా పనిచేయదు. ఇది ఆకలి లేకపోవడం, అజీర్ణం, వికారం, వాంతులు, తరచుగా ప్రేగు కదలికలు వంటి లక్షణాలకు దారితీస్తుంది. బరువు తగ్గడంతో పాటు, శరీరం ఎల్లప్పుడూ అసౌకర్యంగా అనిపిస్తుంది. పొత్తికడుపు నొప్పి, చీలమండల వాపు కూడా కాలేయ సమస్యల లక్షణాలు.