పెద్దపేగు క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే నయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, చికిత్సతో పాటు ఆహారం, జీవనశైలిలో మార్పులు అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, మాంగనీస్ వంటి ఖనిజాలు శరీరానికి తగినంతగా అందితే పెద్దప్రేగు క్యాన్సర్‌తో పోరాడగలవు. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో ఈ విధమైన మినరల్, న్యూట్రీషియన్ రిచ్ ఫుడ్స్ అంటే కూరగాయలు, నట్స్, వాల్ నట్స్, పెరుగు, వెల్లుల్లి వంటివి చేర్చుకోవాలని సూచిస్తున్నారు.