- Telugu News Photo Gallery Foods For Healthy Lungs: This 3 Food Clean Your Lungs Naturally, Know Details Here
Foods For Healthy Lungs: మీ ఊపిరితిత్తులను సహజంగా శుభ్రపరిచే ఆహారాలు ఇవే.. క్రమం తప్పకుండా తినండి
బయటి వాతావరణంలో దుమ్ము, ధూళి వంటి వాయు కాలుష్య కారకాల వల్ల ఊపిరి తిత్తులు త్వరగా పాడైపోతాయి. మాస్క్ ధరించకుండా బయటకు వెళ్లినప్పుడు ఇలాంటి గాలి పీల్చుకుంటే ముక్కులో మంట వంటి సమస్యలు తలెత్తడం ఎప్పుడైనా గమనించారా? వాయు కాలుష్యం మూలంగానే ఇలా జరుగుతుంది. అందువల్లనే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం పెద్ద సవాలుగా మారుతోంది. ఈ కింది ఆహారాలను మీ మెనులో చేర్చుకుంటే నేచురల్‌గా మీ ఊపిరితిత్తులు శుభ్రంగా ఉంటాయి..
Updated on: Mar 01, 2024 | 11:31 AM

బయటి వాతావరణంలో దుమ్ము, ధూళి వంటి వాయు కాలుష్య కారకాల వల్ల ఊపిరి తిత్తులు త్వరగా పాడైపోతాయి. మాస్క్ ధరించకుండా బయటకు వెళ్లినప్పుడు ఇలాంటి గాలి పీల్చుకుంటే ముక్కులో మంట వంటి సమస్యలు తలెత్తడం ఎప్పుడైనా గమనించారా? వాయు కాలుష్యం మూలంగానే ఇలా జరుగుతుంది. అందువల్లనే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం పెద్ద సవాలుగా మారుతోంది. ఈ కింది ఆహారాలను మీ మెనులో చేర్చుకుంటే నేచురల్‌గా మీ ఊపిరితిత్తులు శుభ్రంగా ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అవేంటే ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతిరోజూ కొద్దిగా అల్లం తినడం అలవాటు చేసుకోవాలి. అల్లం జలుబు, దగ్గుకు సహజ నివారిణిగా పనిచేస్తుంది. శ్వాసకోశంలోని అన్ని విషపదార్ధాలను బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. పచ్చి అల్లం మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుందని అనుకోవడం పొరపాటే. వంటలో అల్లం జోడించి తినవచ్చు లేదా అల్లం టీ లేదా సలాడ్‌లలో కూడా వేసుకోవచ్చు. అల్లం ఎలా తిన్నా ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది.

పసుపు శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి సహజ నివారిణిగా పనిచేస్తుంది. ప్రతి రోజు శరీరంలో కొంత మొత్తంలో పసుపు వెళ్లడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుకోవచ్చు. పసుపు రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.

పసుపును వంటల్లో ఉపయోగించడం మాత్రమేకాకుండా కావాలంటే పచ్చి పసుపు ముక్కను నోట్లో వేసుకుని నమలవచ్చు లేదా పాల్లో కలుపుకుని తాగవచ్చు. కానీ పచ్చి పసుపు తింటే మాత్రం రోజూ మళ్లీమళ్లీ తినాల్సిన పనిలేదు. వారానికి 3-4 రోజులు తింటే సరిపోతుంది.

ఈ జాబితాలో తేనెను కూడా చేర్చుకోవచ్చు. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అందుకే జలుబు ఉంటే తేనె తినమని వైద్యులు సలహా ఇస్తారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి ప్రతిరోజూ ఒక చెంచా తేనెను గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.




