Breakfast Time: అల్పాహారానికి సరైన సమయం ఏమిటో తెలుసా..? 90% మందికి ఈ విషయమే తెలియదంట..!
Right time for breakfast: ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పటి నుంచి ఉరుకులు పరుగుల జీవితం.. దీంతో చాలా మంది ఆరోగ్యంపై దృష్టిసారించడం లేదు.. అయితే.. ఉదయం అల్పాహారం తీసుకోవడానికి సరైన సమయం ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Updated on: Jul 18, 2023 | 8:28 AM

Right time for breakfast: ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పటి నుంచి ఉరుకులు పరుగుల జీవితం.. దీంతో చాలా మంది ఆరోగ్యంపై దృష్టిసారించడం లేదు.. అయితే.. ఉదయం అల్పాహారం తీసుకోవడానికి సరైన సమయం ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ సమయంలో మనం అల్పాహారం తీసుకోకపోతే, మన శరీరంపై కొన్ని ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. సమయానికి అల్పాహారం తీసుకోకపోవడం మన శరీరంలోని శక్తి స్థాయిని తగ్గిస్తుంది. రోజంతా అలసిపోయి బలహీనంగా అనిపించవచ్చు. ఇది మన మానసిక ఒత్తిడి.. ఆందోళనను పెంచుతుంది. మరోవైపు, మనం అల్పాహారం మానేస్తే, మన రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమవుతుంది. రక్తపోటు, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే సరైన సమయంలో అల్పాహారం తీసుకోవడం మీ ఆరోగ్యానికి మరియు సమతుల్య జీవనశైలికి చాలా ముఖ్యం.

ఉదయం సరైన సమయంలో అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మీ శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. మీ శరీరానికి సరైన శక్తిని అందించకపోతే, మీరు ఉదయం నుంచే అలసట, బలహీనతను అనుభవించవచ్చు. దీనితో పాటు, సరైన సమయంలో అల్పాహారం తీసుకోకపోవడం మీ ఆకలిని మరింత పెంచుతుంది. ఇది మీరు ఎక్కువ తినడానికి కారణం అవుతుంది. దీంతో మీ శరీరం బరువు పెరిగే అవకాశం ఉంది.

అల్పాహారం తీసుకోవడానికి సరైన సమయం?.. ఉదయం 7 నుండి 8 గంటల మధ్య అల్పాహారం తీసుకోవడానికి ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. కానీ, ఈ సమయంలో మీరు అల్పాహారం తీసుకోలేకపోతే, ఉదయం 10 గంటలలోపు చేయండి. ఇలాంటి దినచర్యను అలవర్చుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి అందుతుంది.

Breakfast

ఆరోగ్యకరమైన అల్పాహారం ఎంపిక.. అల్పాహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు మేలు చేసే పీచు శరీరానికి అందుతుంది. మీరు ఓట్ మీల్, ఫ్రూట్, వెజిటబుల్ స్మూతీ, గుడ్లు లాంటి వాటిని చేర్చుకోవచ్చు. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఇంకా బరువు నియంత్రణలో సహాయపడుతుంది. అందువల్ల, ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం..




