- Telugu News Photo Gallery Japan's Green Rooftop Car Parks: Transforming Urban Parking Lots into Stunning Floating Gardens
Floating Garden: పూల పందిరిలో కార్ పార్కింగ్.. ఆకట్టుకుంటున్న అద్భుత దృశ్యం.. ఎక్కడో తెలుసా?
సాధారణంగా వాహనాల పార్కింగ్ కోసం షెడ్స్ నిర్మించడం చూస్తుంటాం. అవి కూడా అన్ని ఒకే దగ్గర ఉంచేలా ఏర్పాటు చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం కార్ల పార్కింగ్ కోసం ఏకంగా పూల పందిళ్లనే వేశారు. అది కూడా ఒక్కొక్క కారుకు ఒక్కొక్క పందిరి. ఈ దృశ్యం చూడ్డానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. అందుకే ఇందుకు సంబంధించిన ఫోటోలను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.
Updated on: Oct 19, 2025 | 3:30 PM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ఉన్న పచ్చని ప్రదేశాలు వేగంగా కనిపించకుండా పోతాయి. పచ్చని ప్రకృతిని నాశనం చేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ నిర్మిస్తుంటారు. కానీ జపాన్‌లోని ఒక నగరంలో మాత్రం ప్రకృతి ప్రజలను ఆకట్టుకుంటుంది. ఇటీవలే వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా షేర్ చేసిన, ప్రస్తుతతం వైరల్ అవుతున్న ఒక ఫోటో దీనిని అందంగాన్ని ప్రపంచానికి చూపిస్తోంది. ఈ ఫోటోలో ఇది ఒక సాధారణ పార్కింగ్ స్థలాన్ని పూల తోటగా మార్చడాన్ని మీరు చూడవచ్చు.

ఈ వైరల్ చిత్రంలో మీరు ఒక్కో కారూ- ఒక్కో పూల పందిట్లో పార్క్ చేసి ఉండడం మీరు చూడవచ్చు. కార్ల పార్కింగ్‌నే గార్డెన్‌లా మార్చుతూ జపాన్‌లో ఒక నగరంలో ఈ వినూత్నమైన ఆలోచన చేశారు నిర్వాహకులు. కార్లకు చల్లదనాన్ని ఇస్తూనే, పూలవనంలా కనువిందు చేసేలా ఏర్పాటు చేసిన ఈ పార్కింగ్ ఐడియా సూపర్ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ప్రాంతాలలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన మొక్కలు పార్క్ చేసిన కార్లుపై, చుట్టుపక్కల వాతావరణంలోని ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఇవి అక్కడి గాలి నాణ్యతను పెంచుతాయి. వాటి ప్రభావం మానవులకు మాత్రమే పరిమితం కాదు. తేనేటీగలు సీతాకోకచిలుకలు వంటి వాటి మనుగడకు కూడా తోల్పడుతాయి.

సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్లకు హైవే ఛార్జింగ్ స్థలాలు ఇలా ఉండాలి. ప్రభుత్వం గ్రీన్ టెక్ కోసం అలాంటి గ్రీన్ జోన్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఇక వినియోగదారుడు రాసుకొచ్చాడు.

పార్కింగ్ స్థలాలను తేలియాడే తోటలుగా మార్చడం నగరాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా గాలి నాణ్యతను మెరుగుపరచడంలో, వేడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. పచ్చని జీవనంలో జపాన్ ఆవిష్కరణ నిజంగా స్ఫూర్తిదాయకమని రాసుకొచ్చాడు.




