AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali: ఈ ఐదుగురికి పటాకులు చాలా డేంజర్.. కాల్చే ముందు ఇవి గుర్తుంచుకోండి..

దీపావళి వచ్చిందంటే ఆ సందడే వేరు. ప్రజలంతా సంతోషంగా ఈ వేడుకలను జరుపుకుంటారు. ఇది వెలుగుల పండుగ అయినప్పటికీ, పటాకుల నుండి వచ్చే పొగ, కాలుష్యం, పెద్ద శబ్దం కొందరికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ ఐదు వర్గాల ప్రజలు పటాకులకు దూరంగా ఉండటం చాలా అవసరం.

Krishna S
|

Updated on: Oct 19, 2025 | 3:14 PM

Share
శ్వాసకోశ వ్యాధులు: పటాకుల పొగలోని విష వాయువులు, సూక్ష్మ కణాలు ఊపిరితిత్తులను చికాకు పెట్టి, ప్రాణాంతకమైన ఉబ్బసం దాడులకు లేదా శ్వాస సమస్యలకు కారణమవుతాయి.

1 / 5
చిన్న పిల్లలు: వీరి ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో పొగ వలన న్యుమోనియా వచ్చే ప్రమాదం ఎక్కువ. పెద్ద శబ్దం వారి వినికిడి, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

2 / 5
గర్భిణీ స్త్రీలు: పటాకుల పొగలోని రసాయనాలు తల్లికి, గర్భంలోని శిశువు ఎదుగుదలకు హాని చేయవచ్చు. పెద్ద శబ్దం ఒత్తిడిని, రక్తపోటును పెంచుతుంది.

3 / 5
గుండె రోగులు: అకస్మాత్తుగా వచ్చే పెద్ద శబ్దం ఒత్తిడి హార్మోన్లను పెంచి, రక్తపోటును, గుండె వేగాన్ని పెంచుతుంది. ఇది గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీసే ప్రమాదం ఉంది.

4 / 5
వృద్ధులు: వృద్ధులలో వ్యాధులతో పోరాడే శక్తి తక్కువగా ఉంటుంది. పెద్ద శబ్దం ఆందోళన, నిద్రలేమిని పెంచుతుంది, కాలుష్యం దీర్ఘకాలిక రోగాలను తీవ్రం చేస్తుంది.

5 / 5