- Telugu News Photo Gallery Jaggery: Eat These Five Common Foods With Jaggery To Boost Immunity In Winters
Jaggery: శీతాకాలంలో తేనెలో బెల్లం కలిపి తింటే ఆ వ్యాధుల నుంచి ఉపశమనం
శీతాకాలంలో బెల్లంతో తయారు చేసిన ఆహారాలు తింటే అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. బెల్లం చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తులను కాలుష్యం నుంచి రక్షిస్తుంది. బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బెల్లం, తేనె కలిపి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తేనె - బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు శారీరక శక్తిని మెరుగుపరచడంలో..
Updated on: Nov 27, 2023 | 11:44 AM

శీతాకాలంలో బెల్లంతో తయారు చేసిన ఆహారాలు తింటే అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. బెల్లం చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తులను కాలుష్యం నుంచి రక్షిస్తుంది. బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యితో బెల్లం కలిపి తింటే జీవక్రియ మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే భోజనం చేసిన తర్వాత మాత్రమే ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి.

చలికాలంలో తులసి ఆకుల్లో బెల్లం కలిపి తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. తులసి ఆకులు, బెల్లంతో తయారు చేసిన టీ తాగడం వల్ల చల్లని వాతావరణంలో శరీరం వెచ్చగా ఉంటుంది. అలాగే ఈ మిశ్రమం రక్తాన్ని శుద్ధి చేయడానికి సహకరిస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యితో బెల్లం కలిపి తింటే జీవక్రియ మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే భోజనం చేసిన తర్వాత మాత్రమే ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి.

ప్రతి రాత్రి పసుపు కలిపి ఒక గ్లాసు పాలు తాగడం వల్ల శారీరక మంట తగ్గుతుంది. హాయిగా నిద్ర పడుతుంది. ఈ పాలల్లో బెల్లం కలిపి తాగితే జలుబు, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.




