Relationship Tips: మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారా?.. ఎలా తెలుసుకోవాలంటే?
ప్రేమైనా, పెళ్లైనా, స్నేహమైనా.. ఇలా ఏ సంబంధంలోనైనా నమ్మకం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా మీరు వివాహ బంధంలో ఉన్నా, ప్రేమలో ఉన్నా అందులో నమ్మకం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఒక వేళ ఇద్దరి మధ్య నమ్మకం లేకపోతే ఆ బంధాలు ఎక్కువరోజులు నిలవవు. అయితే ఈ మధ్య జరుగుతున్న వివాహేతరసంబంధాలు, ప్రేమించిన వారిని మోసం చేయడం వంటి ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే మిమ్మల్ని మీ భాగస్వామి మోసం చేస్తున్నారా? లేదా అనేది వారి ప్రవర్తణను పట్టి గుర్తించవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Sep 16, 2025 | 6:30 AM

సాధారణంగా మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే మీ నుంచి ప్రతి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలని చూస్తారు. గతంలో మీ ముందే ఫోన్‌ను యూజ్ చేసే మీ భాగస్వామి, అకస్మాత్తుగా ఫోన్‌కు సీక్రెట్ లాక్స్ పెట్టడం, తరచూ మొబైల్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచడం, అర్థరాత్రి మెసేజ్‌లు చేయడం వంటికి చేస్తుంటే.. మీ భాగస్వామి మీ నుంచి ఏదో దాస్తున్నాడనే దానికి ఇదొక సంకేతం కావచ్చు. ప్రతి ఒక్కరూ గోప్యతను కోరుకుంటారు, కానీ సంబంధం సమయంలో మీ భాగస్వామి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పును మీరు గమనించినట్లయితే, వారు మీ నుండి ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం.

మీ భాగస్వామి పని సాకుతో తరచుగా ఇంటికి ఆలస్యంగా రావడం ప్రారంభిస్తే, మీ ఫోన్‌కు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోతే లేదా ప్రయాణ ప్రణాళికలు వేసుకున్న తర్వాత అకస్మాత్తుగా నో చెబితే, వారు తమ జీవితంలో ఏదో దాచిపెడుతున్నారని అర్థం. ఓవర్ టైం లేదా ఆఫీస్ మీటింగ్ అని చెప్పే కథలు ఎప్పుడూ నిజం కాకపోవచ్చు. మీ లైఫ్‌లో ఇలా జరిగితే అప్రమత్తంగా ఉండండి.

సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, దానిని దాచడానికి దొంగ ప్రేమను మీపై ఒకలబోస్తారు. కొన్ని సార్లు ముందు నుంచి వాళ్లతో ఎక్కువ ప్రేమగా లేకపోయినా.. ఆకస్మిక వారిపై ప్రేమ పుట్టుకొచ్చినా, బహుమతులు, ప్రశంసలు లేదా ప్రేమ మాటలు. ఆప్యాయతలో ఆకస్మిక మార్పులు కొన్నిసార్లు అపరాధభావాన్ని దాచడానికి ఒక మార్గం కావచ్చు.

మీ భాగస్వామి మీతో సమయం గడపడానికి ఇష్టపడకపోయినా? మీ కళ్ళలోకి చూసి మాట్లాడడం తగ్గించినా, స్పర్శ నుండి దూరంగా ఉండాలని ట్రై చేసినా, లేదా శృంగార క్షణాలను తగ్గించడం ప్రారంభిస్తే, ఇది మీ మధ్య గ్యాప్ పెరిగే అవకాశాలను పెంచవచ్చు. కాబట్టి ఈ విషయాల్లో మీరు శ్రద్ధ వహించండి.

(NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే నిపుణులను సంప్రదించండి. వీటిని టీ9 దృవీకరించడం లేదు)




