మీకు థైరాయిడ్ సమస్య ఉందా.? ఈ ఫుడ్స్‌కి దూరంగా ఉండాల్సిందే..
ఒక్కసారిగా బరువు పెరగడం లేదా తగ్గడం, తరచుగా జలుబు, దగ్గు రావడం, మొటిమలు, ఆందోళన.. ఇవి థైరాయిడ్ లక్షణాలు. థైరాయిడ్ సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటాయి. థైరాయిడ్ బయటపడితే రోజూ మందులు వాడాల్సి ఉంటుంది. శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి మందులు అవసరం..
Updated on: Sep 16, 2025 | 1:49 PM

శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి మందులు అవసరం. అయితే కేవలం మందులు మాత్రం తీసుకుంటే సరిపోదు. కొన్ని ఆహార జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉన్న రోగులు అస్సలు తినకూడని 5 ఆహారాలు ఇవే. వీటిని తింటే తీసుకునే మందుల ప్రభావాన్ని కూడా పాడు చేస్తాయి. థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు సోయా ఆహారాలకు దూరంగా ఉండాలని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది థైరాయిడ్ మందులు సరిగా పనిచేయకపోవడానికి కారణమవుతుంది.

సోయాబీన్స్, సోయా పాలు, టోఫు వంటి వాటికి దూరంగా ఉండాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు థైరాయిడ్ మందుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఈ థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు క్యాబేజీ వంటి కూరగాయలకు దూరంగా ఉండాలి.

ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు థైరాయిడ్ రోగుల్లో బరువును పెంచుతాయి. శారీరక సమస్యలను పెంచుతాయి. ఇటువంటి ఆహారాలలో ఉప్పు, చక్కెర అధికంగా ఉంటాయి. దీనివల్ల సమస్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు పోషకాహార నిపుణులు.

మీకు థైరాయిడ్ ఉంటే స్వీట్లను తినడం మానుకోవాలి. మితంగా చక్కెర తినాలి. ఇవి థైరాయిడ్ సమస్యలున్న వారు బరువును మెయింటైన్ చేయడం కష్టతరం చేస్తాయి. కాబట్టి తీపి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి తింటే మరిన్ని కొత్త సమస్యలు వస్తాయి.

థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు ఎక్కువగా కాఫీని తాగకూడదు. ఖాళీ కడుపుతో కాఫీ తాగ కూడదు. థైరాయిడ్ మందులు తీసుకునే అరగంట ముందు, తర్వాత కూడా కాఫీ తాగకూడదు. కాదని తాగితే సమస్య మరింత పెడుతుందని అంటున్న ఆరోగ్య నిపుణులు.




