Wine Benefits: వైన్ తాగడం గుండెకు నిజంగా మంచిదా? దీన్ని తాగితే ఏమవుతుందో తెలుసా?
రెడ్ వైన్ పండ్ల నుంచి తయారవుతుంది కాబట్టి, దానిని తాగడం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది అనుకుంటారు. వైన్ నిపుణురాలు సోనాల్ హాలండ్ మాట్లాడుతూ ఆల్కహాలిక్ పానీయాల గురించి అపోహల గురించి వివరించారు. వైన్ తాగేవారు ఎప్పుడూ రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. ఇది గుండెకు ఆరోగ్యకరమైనదని
Updated on: Oct 20, 2025 | 12:15 PM

ఫ్రాన్స్, హంగేరీలలో ఉత్పత్తి అయ్యే స్వీట్ వైన్లు వాటి నాణ్యత కారణంగా ఖరీదైనవనిగా ఎంచబడుతాయి. కాబట్టి స్వీట్ వైన్లు కొత్తవారికి మాత్రమేనని, అవి చాలా చౌకగా ఉంటాయనేది పూర్తిగా అపోహ మాత్రమే.

షాంపైన్ పార్టీలకు మాత్రమే అనే అపోహ కూడా ఉంది. కానీ అది నిజం కాదు. ఇటువంటి మెరిసే వైన్ల వాడకం పార్టీలకు మాత్రమే పరిమితం కాదు. ఏ ఆల్కహాలిక్ పానీయం అయినా దానిని మితంగా తాగడం ఉత్తమమని వైన్ నిపుణులు అంటున్నారు.

రెస్వెరాట్రాల్ గుండె ఆరోగ్యానికి మంచిదనడం పూర్తిగా అపోహ. గుండె సమస్యలు ఉన్నవారు రెడ్ వైన్ తాగడం అంత మంచిది కాదని అంటున్నారు. బెర్రీలు, ద్రాక్ష, నట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రెస్వెరాట్రాల్ పొందవచ్చు. ఆల్కహాల్ ఎప్పుడూ ఆరోగ్యకరమైన పానీయం కాదు. కాబట్టి దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవడం బెటర్. ఇది శాశ్వత ఎంపికగా మార్చకూడదు.

మద్యం సేవించేవారిలో మరో అపోహ ఏమిటంటే స్వీట్ వైన్ చౌకగా ఉంటుందని, కొత్తగా తాగేవారికి ఇది మంచిదని చెబుతుంటారు. కానీ ఇది గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన అనేక స్వీట్ వైన్లు అధిక ధరలు పలుకుతున్నాయి.

షాంపైన్ పార్టీలకు మాత్రమే అనే అభిప్రాయం కూడా ఉంది. కానీ అది నిజం కాదు. ఇలాంటి మెరిసే వైన్ వాడకం పార్టీలకు మాత్రమే పరిమితం కాదు. ఎక్కడైనా తాగొచ్చు. కానీ వైన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏ ఆల్కహాలిక్ డ్రింక్ అయినా పరిమిత పరిమాణంలో తాగడం సముచితం.




