- Telugu News Photo Gallery Is it good to health drink Thati Kallu? Do you know what happens if you drink it?
Thati Kallu: తాటి కల్లు తాగడం మంచిదేనా.? తాగితే ఏం అవుతుందో తెలుసా.?
తాటి కల్లు.. పల్లెటూర్లలో చాలా మంది తాగుతూ ఉంటారు. చాలా మంది ఇప్పటికీ తాటి కల్లు తాగుతూ ఉంటారు. వివిధ అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా ఈ కల్లు తాగుతారు. తాటి కల్లు తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెబుతూ ఉంటారు. మరి తాటి కల్లు తాగడం మంచిదేనా? తాగితే బాడీలో ఏం జరుగుతుందో చూద్దామా..
Updated on: Jun 13, 2025 | 6:40 PM

తాటి చెట్టు నుంచి కుండలోకి వచ్చిన ద్రావణాన్ని కల్లు అంటారు. ఈ నీరా చాలా టేస్టీగా ఉంటుంది. పలు రకాల ఆరోగ్య సమస్యల్ని కూడా తగ్గిస్తుంది. కల్లు తాటి చెట్టు నుంచి తీసిన 12 గంటల్లోనే తీసుకోవాలి. ఆ తర్వాత ఇది విషంగా మారుతుంది.

ఇలా సేకరించిన 100 ఎమ్ఎల్ కల్లులో 75 క్యాలరీలు ఉంటాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ కూడా సుక్రోజ్ రూపంలో ఉంటాయి. కాబట్టి దీన్ని షుగర్ ఉన్న వారు తీసుకుంటే.. చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగవు.

పలువురు పోషకాహార నిపుణులు సైతం కల్లు తాగడం చాలా మంచిదని చెబుతున్నారు. ఈ నీరాను వెంటనే తీసుకుంటే మత్తు లేకుండా ఉంటుంది. సమయం గడిచే కొద్దీ ఆల్కహాల్ శాతం పెరుగుతుంది.

అయితే ఈ కల్లు పులవకుండా ఉండటానికి కొంతమంది ఇందులో క్యాల్షియం హైడ్రాక్సైడ్ అనే రసాయన్ని కలుపుతారు. దీంతో కల్లులో ఆల్కహాల్ శాతం మరింత పెరుగుతుంది. ఇలా రసాయనాలు కలిపిన కల్లు తాగడం వల్ల శరీరంపై చెడు ప్రభావం కలుగుతుంది.

ఇలా ఆల్కహాల్ శాతం పెరిగి, మత్తు ఇచ్చే కల్లును తాగడం వల్ల ఎన్నో రకాల దుష్ప్రభావాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోని ఊపిరి తిత్తులు, కాలేయాన్ని, గుండెపై తీవ్ర ప్రభావం చూపించి.. పాడయ్యేందుకు తోడ్పడుతుంది.




