- Telugu News Photo Gallery Inhaling the smell of camphor can reduce all these problems, check here is details
Camphor Uses: కర్పూర వాసన పీలిస్తే.. ఈ సమస్యలన్నింటికీ బైబై చెప్పొచ్చు!
సాధారణంగా కర్పూరాన్ని ఎక్కువగా దేవుడికి సంబంధించిన పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కర్పూరం నుంచి ఒక మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. అయితే కేవలం కర్పూరాన్ని పూజలకే కాకుండా.. వీటితో చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. కర్పూర వాసనను ప్రతి రోజూ మీరు పీల్చితే.. ఒత్తిడి, ఆందోళన అవేవి దూరం అవుతాయి. కర్పూరం నుంచి మంచి సువాసన..
Updated on: Apr 11, 2024 | 3:09 PM

సాధారణంగా కర్పూరాన్ని ఎక్కువగా దేవుడికి సంబంధించిన పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కర్పూరం నుంచి ఒక మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. అయితే కేవలం కర్పూరాన్ని పూజలకే కాకుండా.. వీటితో చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు.

కర్పూర వాసనను ప్రతి రోజూ మీరు పీల్చితే.. ఒత్తిడి, ఆందోళన అవేవి దూరం అవుతాయి. కర్పూరం నుంచి మంచి సువాలసన వస్తుంది. కాబట్టి ఒత్తిడి దూరమై మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీకు తెలియకుండానే మీ ముఖంపై చిరునవ్వు వస్తుంది.

అలాగే జలుబు, ద్గగు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. తల నొప్పి, మైగ్రేన్ సమస్యలతో ఇబ్బంది పడేవారు సైతం కర్పూరం వాసన పీల్చితే ఉపశమనం లభిస్తుంది. ఈ వాసన పీల్చితే అసలట కూడా దూరం అవుతుంది.

కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి సూక్ష్మ క్రిములను దూరంగా ఉంచుతాయి. మీరు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కర్పూరం పొడిని ఉపయోగిస్తే.. బ్యాక్టీరియా వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే ఇల్లు కూడా సువాసనలు వెదజల్లుతాయి.

కర్పూరాన్ని పొడిలా చేసి.. నూనెలతో కలిపి శరీరంపై రాస్తే.. నొప్పులు, దురద వంటివి తగ్గుతాయి. కండరాలు, కీళ్లల్లో నొప్పి కూడా తగ్గిస్తుంది. అయితే కర్పూరం ఉపయోగించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత మందికి కర్పూరం పడదు. అలెర్జీ సమస్యలు వస్తాయి.




