- Telugu News Photo Gallery Eating these foods will double your stamina, Check here is details in Telugu
Stamina Increase Foods: ఈ ఆహారాలు తింటే మీ స్టామినా రెట్టింపు అవుతుంది.. అస్సలు మిస్ చేయకండి!
ప్రస్తుత కాలంలో త్వరగా జబ్బుల బారిన పడుతూ ఉంటున్నారు. ఎవరిని కదిలించినా ఏదో ఒక అనారోగ్య సమస్యల గురించి చెబున్నారు. శరీరంలో శక్తి, ఇమ్యూనిటీ లెవల్స్ తగ్గిపోవడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు. నీరసం, అలసట, జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాధులతో పోరాడాలంటే మీ శరీరంలో తగినంత స్టామినా ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. మరి స్టామినాను పెంచే ఆహారాలు ఏంటో..
Updated on: Apr 11, 2024 | 2:14 PM

ప్రస్తుత కాలంలో త్వరగా జబ్బుల బారిన పడుతూ ఉంటున్నారు. ఎవరిని కదిలించినా ఏదో ఒక అనారోగ్య సమస్యల గురించి చెబున్నారు. శరీరంలో శక్తి, ఇమ్యూనిటీ లెవల్స్ తగ్గిపోవడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు. నీరసం, అలసట, జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వ్యాధులతో పోరాడాలంటే మీ శరీరంలో తగినంత స్టామినా ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. మరి స్టామినాను పెంచే ఆహారాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. వీటిని తింటే.. శరీరంలో స్టామినా లెవల్స్ అనేవి పెరుగుతాయి.

కోడిగుడ్లలో విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. గుడ్లలోని అధిక క్వాలిటీ కలిగిన ప్రోటీన్, అమైనో ఆమ్లాలు శక్తిని రెట్టింపు చేస్తాయి. బీన్స్‌లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులోని ప్రోటీన్ ఎనర్జీని పెంచుతుంది.

చియా సీడ్స్‌లో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి తింటే శక్తిని స్థాయిలు పెరుగుతాయి. శరీరానికి కూడా చలువ చేస్తుంది. అరటి పండు తిన్నా కూడా శక్తి అనేది పెరుగుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీంతో స్టామినా రెట్టింపు అవుతుంది.

అలాగే చికెన్, ఓట్మీల్, యాపిల్, డ్రైఫ్రూట్స్, నీరు, గుమ్మడి, సన్ ఫ్లవర్ సీడ్స్, చెరకు రసం, దానిమ్మ పండు వీటిని తింటే మీకు తక్షణ శక్తి లభించడమే కాకుండా.. మీ స్టామినా రెట్టింపు అవుతుంది. దీంతో త్వరగా జబ్బుల బారిన పడకుంటా ఉంటారు.




