- Telugu News Photo Gallery Follow these tips in summer to avoid sweaty smell, Check here is details in Telugu
Home Remedies for Sweat: వేసవి కాలంలో ఇలా చేశారంటే చెమట వాసన రానే రాదు!
వేసవి కాలంలో ఎక్కువగా ఎండ, ఉక్కపోత ఉంటాయి. ఈ ఉక్క కారణంగా చెమట బాగా పడుతుంది. దీంతో ప్రతీ ఒక్కరి దగ్గర చెమట వాసన వస్తుంది. ఈ క్రమంలో ఉదయం, రాత్రి రెండు పూటలా స్నానం చేస్తారు. ఈ చెమట వాసన కారణంగా బయటకు వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఈ వాసన రాకుండా ఉండాలంటే.. ఈ హోమ్ రెమిడీస్ ట్రై చేసి చూడండి. చెమట ఎక్కువగా పట్టకుండా, శరీరంలోని వేడిని తగ్గించాలంటే.. ఐస్ వాటర్ స్ప్రే బాగా పని చేస్తుంది. మీర చర్మం తాజాగా..
Updated on: Apr 11, 2024 | 2:02 PM

వేసవి కాలంలో ఎక్కువగా ఎండ, ఉక్కపోత ఉంటాయి. ఈ ఉక్క కారణంగా చెమట బాగా పడుతుంది. దీంతో ప్రతీ ఒక్కరి దగ్గర చెమట వాసన వస్తుంది. ఈ క్రమంలో ఉదయం, రాత్రి రెండు పూటలా స్నానం చేస్తారు. ఈ చెమట వాసన కారణంగా బయటకు వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఈ వాసన రాకుండా ఉండాలంటే.. ఈ హోమ్ రెమిడీస్ ట్రై చేసి చూడండి.

చెమట ఎక్కువగా పట్టకుండా, శరీరంలోని వేడిని తగ్గించాలంటే.. ఐస్ వాటర్ స్ప్రే బాగా పని చేస్తుంది. మీర చర్మం తాజాగా కూడా ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు లేక ఇంట్లో ఉన్నా.. రెగ్యులర్‌గా ముఖానికి ఈ ఐస్ వాటర్ స్ప్రే చేయండి. దీని వల్ల చెమట తక్కువగా పడుతుంది.

స్నానం చేసిన తర్వాత చెమట, దుర్వాసన దూరం చేసుకోవడానికి టాల్కమ్ పౌడర్ రాస్తూ ఉంటారు. కానీ వీటి వల్ల ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి.. యాంటీ పెర్స్పిరెంట్ క్రీమ్స్, పౌడర్స్ ఉపయోగించడం బెటర్.

చెమట ఎక్కువగా పట్టకుండా, బాడీ కూల్‌గా ఉండాలంటే.. చల్ల నీటితో స్నానం చేయాలి. చాలా మంది ఎండాకాలంలో కూడా వేడి నీటితో చేస్తారు. అలా కాకుండా.. ఉదయం, రాత్రి చల్ల నీటితో స్నానం చేస్తే.. శరీరంలో టెంపరేచర్ తగ్గి.. చెమట తక్కువగా పడుతుంది.

ఎండా కాలంలో మసాలాలతో తయారు చేసిన ఆహార పదార్థాల కంటే.. బాడీని చల్లబరిచే వాటిని తినడం మంచిది. వేసవిలో లభ్యమయ్యే పుచ్చ కాయ, ఖర్జూజా, సపోటా, మామిడి పండ్లు, కొబ్బరి నీరు, చెరకు రసం వంటి వాటిని తీసుకోవాలి.




