- Telugu News Photo Gallery Business photos Bollywood Actor Emraan Hashmi Has The Most Expensive Rolls Royce Car Sharukh Khan Salman Khan
Bollywood Actors: వామ్మో.. ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ల దగ్గర ఇంత ఖరీదైన కార్లా.. ధర ఎంతో తెలిస్తే షాకే..
రోల్స్ రాయిస్ కార్లు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా ఉన్నాయి. కస్టమైజేషన్ సర్వీస్ కారణంగా ఈ రోల్స్ రాయిస్‌పై ధనవంతులు బాగా ఆకర్షితులవుతారు. రోల్స్ రాయిస్ బాలీవుడ్‌లో కూడా విపరీతమైన ప్రజాదరణ పొందింది. అయితే ఈ రోజు ఏ బాలీవుడ్ నటుడి వద్ద అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారు తెలుసుకుందాం..
Updated on: Apr 11, 2024 | 1:27 PM

అజయ్ దేవగన్ (Ajay Devgn): బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్‌కు విలాసవంతమైన రోల్స్ రాయిస్ ఉంది. అతనికి రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన SUVలలో ఒకటి. దీని ధర దాదాపు 6.9 కోట్ల రూపాయలు.

హృతిక్ రోషన్ (Hrithik Roshan): బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్‌కి కూడా రోల్స్ రాయిస్ అంటే పిచ్చి. క్రిష్ 4 సినిమాతో హృతిక్ మరోసారి ప్రేక్షకులను అలరించనున్నాడు. 7 కోట్ల రూపాయల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II కారు హృతిక్‌కు ఉంది.

సంజయ్ దత్ (Sanjay Dutt): సంజుగా ప్రసిద్ధి చెందిన సంజయ్ దత్ కూడా రోల్స్ రాయిస్ అభిమాని. సంజయ్ దత్ కార్ కలెక్షన్‌లో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. కానీ రోల్స్ రాయిస్ ఘోస్ట్ భిన్నంగా ఉంటుంది. ఈ లగ్జరీ కారు ధర దాదాపు 8.3 కోట్ల రూపాయలు.

అక్షయ్ కుమార్ (Akshay Kumar): ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా విలాసవంతమైన రోల్స్ రాయిస్ కారును కలిగి ఉన్నారు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ అక్షయ్ కుమార్ కార్ కలెక్షన్‌కు మరింత అందాన్ని చేకూర్చింది. ఈ రోల్స్ రాయిస్ కారు ధర దాదాపు 10.2 కోట్ల రూపాయలు.

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan): బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌కు కూడా రోల్స్ రాయిస్ ఉంది. కింగ్ ఖాన్ వద్ద రోల్స్ రాయిస్ కల్లినాన్ బ్లాక్ కారు ఉంది. ధర గురించి చెప్పాలంటే సుమారు రూ. 11.3 కోట్లు.

ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) : ఇప్పుడు బాలీవుడ్ నటులలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారును కలిగి ఉన్న నటుడు ఇమ్రాన్ హష్మీ. ఇతనికి అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారు ఉంది. దాదాపు రూ.12.2 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ బ్లాక్ కారు ఉంది.




