PM Kisan Mandhan Yojana: రైతులకు ప్రతి నెలా రూ. 3000 పెన్షన్.. ఈ పథకంలో చేరితే చాలు..
దేశానికి ఆయుపట్టు రైతు. రైతు సుభిక్షంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుంది. అందుకే రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తుంటాయి. పెట్టుబడి సాయం దగ్గర నుంచి సబ్సిడీలపై ఎరువులు, మందులు, ఏదైనా అకాల విపత్తుతో నష్టం వాటిల్లితే పరిహారం వంటివి అందిస్తూ సాయం చేస్తున్నాయి. అయితే ఇవన్నీ సాగు చేసే రైతులకుమాత్రమే అందుబాటులో ఉంటాయి. మరి ఆ రైతు వృద్ధాప్యంలోకి వెళ్తే పరిస్థితి ఏమిటి? వయసు పైడిన తర్వాత వారు సాగు చేయలేని పరిస్థితుల్లో వారి పోషణ ఎలా? అందుకే కేంద్ర ప్రభుత్వం అలాంటి వారి కోసం ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. దానిపేరు ప్రధాన మంత్రి కిసాన్ మన్‌ధన్ యోజన. దీని సాయంతో అరవై ఏళ్లు పైడిన రైతులకు నెలకు రూ. 3,000 పింఛన్ అందుతుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.