AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Census: అడవిలో పులుల లెక్క తేలుద్దాం రండి..! మీరు ఏం చేయాలంటే?

దేశవ్యాప్తంగా పులుల లెక్కలు తేల్చేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. ‘ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2025-26’ పేరుతో ప్రస్తుతం దేశంలో ఎన్ని పులులు ఉన్నాయో లెక్కకట్టేందుకు నిపుణుల టీంలను రంగంలోకి దింపబోతోంది. ఇటు రాష్ట్రంలో సైతం పులుల సంఖ్యను తెల్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం (ఎన్టీసీఏ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నాలుగేళ్లకోసారి.. రాష్ట్రస్థాయిలో అటవీశాఖ ప్రతి ఏటా జంతుగణన చేపడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణాలోని కవ్వాల్ , అమ్రాబాద్ అభయారణ్యాల పరిదిలో పులుల లెక్కింపునకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

Naresh Gollana
| Edited By: Anand T|

Updated on: Nov 15, 2025 | 6:28 PM

Share
ఈసారి పులుల గణన-2026 లో పాల్గొనేందుకు ఆసక్తి గల స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు, జంతు ప్రేమికులు, ఔత్సాహిక యువకుల నుంచి ఈనెల 22 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అటవిశాఖ ఆహ్వనం పలికింది. 18- 60 ఏళ్ల వయసు కలిగి.. రోజూ అడవి మార్గంలో 10- 15 కి.మీ. వరకు నడిచే సామర్థ్యం కలిగి ఉన్న ఔత్సాహికుల నుండి ఈ దరఖాస్తులను‌ స్వీకరిస్తోంది. ఇది పూర్తిగా స్వచ్చంద కార్యక్రమం కావడంతో ఎలాంటి పారితోషికం ఇవ్వరంటూ పేర్కోంది. అవసరమైన వసతి, రవాణా సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుందని పేర్కొంది.

1 / 10
అయితే పులుల గణనలో వాలంటీర్ల ఎంపిక ఆటవీశాఖకు చిక్కుముడిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల అటవీ బీట్లలో పెద్దపులులు, ఇతర జంతువులను లెక్కించ నుండగా 2620 మంది వాలంటీర్లు స్వచ్చందంగా సేవలు అందించేందుకు ఇప్పటి వరకు ముందుకు వచ్చారు. ఒక్కో వాలంటీరు రెండేసి ఆప్షన్లు ఇవ్వగా... ఇందులో సుమారు 65 శాతానికి పైగా వాలంటీర్లు అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులకు వెళ్లేందుకే ఆసక్తి చూపించారు. కేవలం 7 శాతం మంది మాత్రమే వికారాబాద్ అటవీ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్దమంటూ పేర్కొన్నారు.

2 / 10
ఈ నేపథ్యంలో మిగిలిన అటవీ బీట్లలో అధ్యయనం ఎలా చేయాలన్న పరిస్థితి ఉత్పన్నమైంది. ఈసారి డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) వన్యప్రాణుల గణనను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పులులతో పాటు ఇతర శాఖాహార, మాంసాహార జంతువుల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ దరఖాస్తులు ఈ నెల 22 తో ముగియనుండగా.. ఆ లోపు వచ్చే వారు మిగిలిన టైగర్ జోన్ , కారిడార్ లలో జంతు గణన చేసేలా ఏర్పాట్లు చేస్తోంది అటవిశాఖ.

3 / 10
 పులుల గణనన ఈ ఏడాది అంటే 2025 డిసెంబర్ నుంచి 2026 ఏప్రిల్ మధ్యన మూడు దశల్లో  జరుగుతుందని సమాచారం. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) దేశవ్యాప్తంగా పులులను లెక్కిస్తుంది. దీనిలో వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా భాగమవుతుంది. పెద్దపులులకు ఆవాసాలైన అన్ని అడవుల్లో నాలుగేళ్లకోసారి ఈ గణన చేపడతారు. 2006 నుంచి  దేశ వ్యాప్తంగా ఈ పులుల లెక్కింపు జరుగుతోంది.

4 / 10
ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ) 2025-26 కోసం తెలంగాణ 'ఎర్న్ యువర్ స్ట్రైప్స్' ట్యాగ్‌లైన్‌తో వాలంటీర్లకు ఆహ్వానం పలుకింది. నవంబర్ 4 నుంచి నవంబర్ 22 మధ్య రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఈ రిజిస్ట్రేషన్‌ కోసం ఒక దరఖాస్తును కూడా జత చేసింది. ట్రాన్సెస్ట్ వాక్‌, ట్రయల్ వాక్‌ల‌ను 2026 జనవరి 17 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ( వైల్డ్‌లైఫ్) ఒక ప్రకటనలో పేర్కొంది.

5 / 10
దేశవ్యాప్తంగా పులుల జనాభా అంచనా, ఆవాస పర్యవేక్షణకు పునాది వేసే ఈ శాస్త్రీయ విధానానికి వాలంటీర్లు కచ్చితమైన ఫీల్డ్ డేటాను అందించాలని, అటవీ చట్టాలకు, వన్య ప్రాణులకు గౌరవమివ్వాలని, అర్థవంతమైన సహకారాన్ని అందించాలని వాలంటీర్లను ఆహ్వానించే ఫామ్‌లో పేర్కొంది. డేటా రికార్డింగ్ కోసం M-STrIPES మొబైల్ యాప్‌ను ఎలా వాడాలో చెప్పడంతోపాటు ఫీల్డ్ ప్రొటోకాల్స్‌పై వాలంటీర్లందరికీ శిక్షణ ఇస్తామని తెలిపింది అటవిశాఖ.

6 / 10
 గతంలో పనిచేసిన వాలంటీర్లకు టైగర్ సెల్ ప్రాధాన్యం ఇస్తుందని.. ఎంపికైన వాలంటీర్లకు శిక్షణ అందిస్తామని అని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ సునీల్ హేరామత్ తెలిపారు. ఈ యాప్‌లోనే ఎప్పటికప్పుడు అటవీ సిబ్బందితో పాటు వాలంటీర్లు సేకరించిన డేటానంతా యాడ్ చేయాలి. జంతువుల గుర్తులు, పులుల పాదముద్రలు, పులుల గుర్తులు, ఎక్కడ ఈ గుర్తులను గుర్తించారు అనే ప్రతి వివరాన్ని, ఏ సమయంలో గుర్తించారనే దాన్ని ఈ యాప్‌లో నమోదు చేయాలి అని వన్యప్రాణుల కార్యకర్త, ఫారెస్ట్స్ అండ్ వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ (ఎఫ్‌ఏడబ్ల్యూపీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మీర్జా కరీమ్ బేగ్ తెలిపారు.

7 / 10
వాలంటీర్లు కచ్చితంగా 7 రోజుల గడువుకు కట్టుబడి ఉండాలి. మధ్యలో వెళ్లడానికి వీలు లేదని.. వాలంటీర్లు స్లీపింగ్ బ్యాగ్‌లు, ట్రెక్కింగ్ షూ తెచ్చుకోవాలని కోరింది. వసతి, ఆహారం, ఫీల్డ్ ట్రాన్స్‌పోర్టు మాత్రం అటవీ విభాగమే చూసుకుంటుందని తెలిపింది. రాష్ట్రంలో పులుల లెక్కింపు ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ నుంచి పులుల గణన ప్రారంభించనున్నారు. నిజానికి 2026లో గణన మొదలు పెట్టాల్సి ఉండగా.. చలికాలంలో అనుకూల పరిస్థితుల కారణంగా.. పెద్దపులులు, ఇతర జంతువుల సంచారం గణనీయంగా పెరగనున్నాయి.

8 / 10
ఈ నేపథ్యంలో వచ్చే నెల 20 నుంచి పులుల గణన ప్రారంభించనున్నట్లు పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఏలూసింగ్ మేరు పేర్కొన్నారు. ఈ గణనను వీలైనంత మేరకు రాష్ట్రంలో ఎండాకాలం మొదలయ్యేలోగా పూర్తిచేసేలా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఒకవేళ వేసవిలోగా ఈ ప్రక్రియ పూర్తికాకపోతే.. ఆ తర్వాత దీనిని పునః ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

9 / 10
పులుల గణన అనేది పులుల సంఖ్య, పంపిణీ, ఆరోగ్యం వంటి కీలక సమాచారాన్ని సేకరించడానికి ప్రతి నాలుగేండ్లకు ఒకసారి నిర్వహిస్తారు. 2022 నాటి గణాంకాల ప్రకారం.. దేశంలో 3,682 పులులు ఉన్నాయి.

10 / 10
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని

అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..

కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్

అంజీర పండ్లు శాఖాహారమా లేక మాంసాహారమా? తినే ముందు ఇది తెలుసుకోండి

ప్రభాస్, నానిలాంటి హీరోలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది

ఫ్లిప్‌కార్ట్ బై బైలో సేల్‌లో హెయిర్‌ డ్రైయర్లపై భారీ డిస్కౌంట్‌

సూర్యకాంతి లేకున్నా ఇంట్లో పెంచదగిన అద్భుతమైన మొక్కలు!

వెనక్కి నడిస్తే ఆరోగ్యంలో ముందడుగు వేసినట్టేనని తెలుసా?

ఈ ఉప్పు కిలో ధర తెలిస్తే కోటీశ్వరుడికైనా చెమటలు పడతాయి

మొదటి సినిమాతోనే నాగ్‌తో పోటీ పడిన కామెడీ హీరో