AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: మీ ట్రైన్ టికెట్ వేరేవారికి ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా ఈజీ.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..

మన దేశంలో ఎక్కువ మంది రైళ్లలోనే ప్రయాణిస్తారు. దేశంలోనే ఎక్కడికైనా వెళ్లేలా కనెక్టివిటీ ఉండడం, అతి తక్కువ ధరలే రద్దీకి కారణం. ఇక పండగల వేళ ఫుల్ రష్ ఉండడంతో చాలా మంది రిజర్వేషన్ చేయించుకుంటారు. కానీ రిజర్వేషన్ టికెట్ వేరేవారికి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Sep 21, 2025 | 10:08 AM

Share
మీరు రైలు టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ ఏదైనా అనుకోని కారణాల వల్ల ప్రయాణించలేకపోతున్నారు అనుకుందాం. అప్పుడు ఆ టికెట్‌ను వేరేవారికి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చా..? చాలా మందికి ఇది సాధ్యం కాదనుకుంటారు. కానీ భారతీయ రైల్వేలు కొన్ని ప్రత్యేక నిబంధనల ప్రకారం దీనికి అవకాశం ఇస్తున్నాయి.

1 / 5
ఎవరు అర్హులు..? రూల్స్ ప్రకారం.. కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్ బదిలీ చేయడానికి అవకాశం ఉంది. అంటే తల్లిదండ్రులు, భార్యాభర్తలు, తోబుట్టువులు లేదా పిల్లలకు మాత్రమే బదిలీ చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు తమ శాఖ నుండి వ్రాతపూర్వక అభ్యర్థనతో ఈ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే ఈ మార్పు ఒక టికెట్‌పై ఒకసారి మాత్రమే అనుమతించబడుతుంది.

2 / 5
ఎలా మార్చాలి : ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరగదు. టికెట్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నా లేదా ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకున్నా, మీరు తప్పనిసరిగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాలి.  రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు మీరు కౌంటర్‌కు వెళ్లి టికెట్‌ను సమర్పించాలి.

3 / 5
మీరు మీ టికెట్ ప్రింటవుట్‌తో పాటు అసలు ప్రయాణికుడు, కొత్త ప్రయాణికుడు ఇద్దరి ఆధార్ లేదా పాన్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలను తీసుకెళ్లాలి. ఈ సదుపాయం కేవలం కన్ఫార్మ్ టికెట్లపై మాత్రమే లభిస్తుంది. వెయిటింగ్ లిస్ట్ లేదా RAC స్టేటస్‌లో ఉన్న టికెట్లకు ఇది వర్తించదు.

4 / 5
అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత రైల్వే సిబ్బంది టికెట్‌పై కొత్త పేరును నమోదు చేసి, కొత్త టికెట్‌ను లేదా రిసీప్ట్ జారీ చేస్తారు. ఈ ప్రక్రియ వలన టికెట్ రద్దు చేయాల్సిన అవసరం లేకుండానే ప్రయాణం కొనసాగించవచ్చు. ఇది ప్రయాణీకులకు క్యాన్సిల్ ఫీజు చెల్లించాల్సిన అవసరాన్ని తప్పిస్తుంది.

5 / 5