- Telugu News Photo Gallery Illegal mining for colored stones is going on in Karaka quarry of Gologonda mandal of Anakapalli district
Andhra Pradesh: గుట్టు చప్పుడు కాకుండా రంగురాళ్ల తవ్వకాలు.. వెళ్లి చూస్తే..!
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కరక క్వారీలో అనధికార రంగురాళ్ళ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటవీశాఖ అధికారులు ఎంత నిఘాపెట్టినా.. అక్రమార్కులు తవ్వకాలు చేసేస్తున్నారు. తాజాగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న తవ్వకాల పై సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది దాడులు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, మూడు మట్టి మూటలు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు..
Maqdood Husain Khaja | Edited By: Ravi Kiran
Updated on: Dec 12, 2023 | 8:55 AM

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కరక క్వారీలో అనధికార రంగురాళ్ళ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటవీశాఖ అధికారులు ఎంత నిఘాపెట్టినా.. అక్రమార్కులు తవ్వకాలు చేసేస్తున్నారు. తాజాగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న తవ్వకాల పై సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది దాడులు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, మూడు మట్టి మూటలు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

అనకాపల్లి జిల్లా కరక క్వారీలో విలువైన రంగురాళ్లు లభ్యమవుతాయి. మేలిమి రకం వైడూర్యాలు కూడా లభిస్తాయి అన్నది ప్రచారంలో ఉంది. దీంతో అక్రమర్కులు ఎడాపెడా తవ్వకాలు జరిపేస్తున్నారు.

అటవీ సిబ్బంది ఎంత నిఘా పెట్టినప్పటికీ.. నిత్యం ఎక్కడో చోట తవ్వకాలు చేసి విలువైన మట్టి రాళ్లు తరలించుకుపోతున్నారు. 2005లో ఇద్దరు కూలీలు మరణించడంతో.. అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ అక్కడ ప్రత్యేకంగా బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు.

అయినా తవ్వకాలు అడపదడప సాగడంతో.. రెండేళ్ల క్రితం ప్రత్యేకంగా అటవీశాఖ బీట్ కూడా ఏర్పాటు చేశారు. ఇంత నిఘా ఉన్నప్పటికీ.. మారుమూల ప్రాంతంలో తవ్వకాలు చేసేస్తున్నారు. తాజాగా బేస్ క్యాంపు ఈస్ట్ సైడ్ రాతిపొనకు పక్కన తవ్వకాలు జరుగుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. దీంతో అక్కడ నుంచి పరారయ్యారు అయ్యారు.

అధికారులు వారిని వెంబడించి ఒకరిని కొట్టుకొన్నారు. ఆ తర్వాత మరొకరిని కూడా పట్టుకున్నారు. వీరిని బుచ్చయ్యపేట మండలం పొట్ట దొర పాలానికి చెందిన ప్రసాద్, గొలుగొండ మండలం ఎల్లవరంకు చెందిన నూకరాజుగా గుర్తించారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి మరి కొంతమంది కోసం గాలిస్తున్నారు.





























