- Telugu News Photo Gallery If these powders are mixed with water and sprayed, the plants will grow well, check here is details
Plants Grow Tips: ఈ పౌడర్స్ వాటర్‌లో కలిపి స్ప్రే చేస్తే.. మొక్కలు బాగా పెరుగుతాయి..
ఇంట్లో మొక్కలను పెంచుకునే వారు మాత్రం.. ఖచ్చితంగా వాటి పట్ల కేర్ తీసుకుంటూ ఉండాలి. కేవలం నీళ్లు పోస్తేనే చెట్లు పెరగవు. మొక్కలు బాగా పెరిగేందుకు కొన్ని టిప్స్ కూడా ఫాలో అవుతూ ఉండాలి. చెట్లు బాగా పెరిగేందుకు చాలా మంది బయట ఎరువులు వాడుతూ ఉంటారు. వాటికి బదులు ఇంట్లో ఉండే పదార్థాలతనే వాటిని మంచిగా పెంచుకోవచ్చు. ఇంటి చిట్కాలు పాటించడం వల్ల చెట్లు బాగా పెరగడమే కాకుండా..
Updated on: Mar 15, 2024 | 1:26 PM

ఇంట్లో మొక్కలను పెంచుకునే వారు మాత్రం.. ఖచ్చితంగా వాటి పట్ల కేర్ తీసుకుంటూ ఉండాలి. కేవలం నీళ్లు పోస్తేనే చెట్లు పెరగవు. మొక్కలు బాగా పెరిగేందుకు కొన్ని టిప్స్ కూడా ఫాలో అవుతూ ఉండాలి. చెట్లు బాగా పెరిగేందుకు చాలా మంది బయట ఎరువులు వాడుతూ ఉంటారు.

వాటికి బదులు ఇంట్లో ఉండే పదార్థాలతనే వాటిని మంచిగా పెంచుకోవచ్చు. ఇంటి చిట్కాలు పాటించడం వల్ల చెట్లు బాగా పెరగడమే కాకుండా.. మాడకుండా ఉంటాయి. ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల చెట్లు త్వరగా చనిపోయే అకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇంట్లోని మొక్కలు బాగా పెరగాలంటే.. కాఫీ గ్రౌండ్స్ చక్కగా ఉపయోగ పడతాయి. అలాగే వాడి పారేసిన టీ పౌడౌర్స్, కాఫీ పొడి కూడా వేయవచ్చు. దీని వల్ల నైట్రోజెన్ నేల నిర్మాణాన్ని మెరుగ్గా చేసి.. చెట్ల ఎదుగుదలకు చక్కగా సహాయ పడతాయి.

వెనిగర్‌తో కూడా మొక్కలు బాగా పెరుగుతాయి. వెనిగర్‌లో ఉండే ప్రత్యేకమైన గుణాలు.. సూక్ష్మ క్రిములను చంపుతాయి. అలాగే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది వాటర్‌లో కలిపి చెట్లకు స్ప్రై చేయడం వల్ల.. ఫంగల్ వ్యాధులు దరిరావు.

బేకింగ్ సోడాను మొక్కలకు ఉపయోగించడం వల్ల.. బూజు, నల్ల మచ్చలు వంటి శిలీంధ్రాల సమస్యల తగ్గుతుంది. కొద్దిగా బేకింగ్ సోడాను వారానికి ఒక సారైనా.. మొక్కలపై స్ప్రే చేస్తూ ఉంటే.. ఫంగస్ వంటివి దూరంగా ఉంటాయి.





























