- Telugu News Photo Gallery Are you throwing away the lemon peels? Do you know how many are used? check here is details
Lime Peel Uses: రసం తీసాక నిమ్మ తొక్కల్ని పడేస్తున్నారా.. ఎన్ని ఉపయోగాలో తెలుసా..
నిమ్మ కాయ ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మకాయతో కేవలం ఆరోగ్యం కాపాడుకోవడమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అదే విధంగా ఇంటిని కూడా శుభ్రంగా చేసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్ అని నిమ్మకాయకు పేరుంది. ఇంట్లో నిమ్మకాయలు ఉంటూనే ఉంటాయి. ఏదో ఒక అవసరానికి నిమ్మ రసాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. రసం తీసేశాక నిమ్మకాయ తొక్కల్ని పడేస్తూ ఉంటారు. అలా కాకుండా వాటితో..
Updated on: Mar 15, 2024 | 12:26 PM

నిమ్మ కాయ ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మకాయతో కేవలం ఆరోగ్యం కాపాడుకోవడమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అదే విధంగా ఇంటిని కూడా శుభ్రంగా చేసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్ అని నిమ్మకాయకు పేరుంది. ఇంట్లో నిమ్మకాయలు ఉంటూనే ఉంటాయి.

ఏదో ఒక అవసరానికి నిమ్మ రసాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. రసం తీసేశాక నిమ్మకాయ తొక్కల్ని పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ తొక్కలతో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలీదు. వీటిని ఇంటిని క్లీన్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు.

బట్టలపై కొన్ని సార్లు మరకలు పడుతూ ఉంటాయి. ఇవి అంత తొందరగా వదలవు అలాంటప్పుడు.. ఆ మరకలపై ఉప్పు వేసి నిమ్మ తొక్కతో రుద్దితే.. మరకలు మయాం అవుతాయి. అలాగే వీటితో చేతులను కడుక్కుంటే.. బ్యాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి.

నిమ్మ తొక్కలతో రూమ్ ఫ్రెషనర్ కూడా తయారు చేసుకోవచ్చు. నీటిలో కర్పూరం, నిమ్మ తొక్కలు వేసి.. బాగా మరిగించింది. ఈ వాటర్‌ను స్ప్రే బాటిల్‌లో వేసుకుని.. ఇంట్లో మూలమూల్లో స్ప్రే చేస్తే.. మంచి సువాసన వస్తుంది. మనసుకు కూడా రిలాక్స్ అవుతుంది.

నిమ్మ తొక్కలతో గిన్నెలు క్లీన్ చేయడం వల్ల చెడు వాసన పోతుంది. అలాగే బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే.. నశిస్తాయి. అలాగే ఈ నిమ్మ తొక్కలతో పంచదార కలిసి ముఖంపై స్క్రబ్ చేసుకుంటే.. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగి.. ముఖం నీటిగా ఉంటుంది.





























