- Telugu News Photo Gallery How to store spices throughout year spice, check here is details in Telugu
Kitchen Hacks: పసుపు, కారం పాడవ్వకుండా ఏడాది నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!
వేసివి కాలం మొదలైపోయింది. సమ్మర్ వచ్చిందంటే ఇంట్లోకి కావాల్సిన మసాలా దినుసులు, పసుపు, కారం, పచ్చళ్లు, వడియాలు వంటివి నిల్వ చేసుకుంటూ ఉంటారు. వీటిని తయారు చేసేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. లేదంటే ఇవి త్వరగా పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వాటిల్లోకి పురుగు కూడా చేరుతూ ఉంటుంది. దీంతో పారేయాల్సి వస్తుంది. ప్రస్తుతం పచ్చళ్లు పెట్టుకునే సీజన్ కాబట్టి..
Updated on: Mar 30, 2024 | 6:23 PM

వేసివి కాలం మొదలైపోయింది. సమ్మర్ వచ్చిందంటే ఇంట్లోకి కావాల్సిన మసాలా దినుసులు, పసుపు, కారం, పచ్చళ్లు, వడియాలు వంటివి నిల్వ చేసుకుంటూ ఉంటారు. వీటిని తయారు చేసేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. లేదంటే ఇవి త్వరగా పాడయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతేకాకుండా వాటిల్లోకి పురుగు కూడా చేరుతూ ఉంటుంది. దీంతో పారేయాల్సి వస్తుంది. ప్రస్తుతం పచ్చళ్లు పెట్టుకునే సీజన్ కాబట్టి.. మసాలా దినుసులు వంటివి ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు.

నిల్వ ఉండటానికి పసుపు, కారం, పప్పులను స్టోర్ చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలిలి. పసుపు, కారం, మసాలా పౌడర్లు వంటివి గాలి తగలకుండా ఉండే వాటిల్లో పెట్టి గట్టిగా కట్టాలి. ఇలా చేస్తే పురుగు కూడా పట్టకుండా ఉంటుంది.

వీలైనంత వరకూ వీటిని పింగాలి, గాజు పాత్రల్లో నిల్వ చేయండి. వీటిల్లో నిల్వ చేయడం వల్ల త్వరగా పాడవ్వవు. పురుగు పట్టకుండా ఉండేందుకు మిర్చీ పౌడర్‌కు, పసుపుకు నూనె పొరను పట్టించాలి.

అలాగే వీటిని ఎక్కడ పడితే అక్కడ కాకుండా.. ప్రత్యేకమైన చోటులో ఉంచాలి. చిన్న పిల్లలకు అందని చోట ఉంచాలి. నెల లేదా రెండు నెలలకు ఓసారి చెక్ చేసుకుంటూ ఉండాలి.




