అరటి పండ్లు త్వరగా పాడవుతున్నాయా?.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో వారం పాటు తాజాగా ఉంచుకోండి
అరటిపండ్లు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఈ పండును తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. జిమ్‌లో వ్యాయామం చేయడానికి ముందు, తర్వాత కూడా జనాలు వీటిని ఎక్కువగా తింటుంటారు.ఎందుకుంటే వాటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అయితే మళ్లీ మళ్లీ ఎవరు వస్తారని మార్కెట్‌కు వెళ్లినప్పుడు జనాలు ఎక్కవ అరటిపండ్లను తీసుకొచ్చి ఇంట్లో నిలువచేస్తారు.కానీ కొన్ని సార్లు అవి చెడిపోతాయి. కాబట్టి అవి చెడిపోకుండా రెండు వారాల పాటు తాజాగా ఉంచడం ఎలానో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Oct 13, 2025 | 4:01 PM

మనం కొన్ని చిట్కాలను ఉపయోగించడం ద్వారా అరటిపండ్లను ఎక్కువ కాలం తాజాగా ఉంచవచ్చు. దీనివల్ల అవి చాలా రోజుల పాటు చెడిపోకుండా ఉంటాయి.అరటిపండ్లు త్వరగా చెడిపోయి నల్లగా మారుతాయి ఇదే ప్రతి ఒక్కరు ఫేస్ చేసే సమస్య. దీన్ని అదిగమించేందుకు మీరు వాటిని సాధారణ దశలతో సరిగ్గా నిల్వ చేయండి.

అరటిపండ్లను గుత్తులుగా నిల్వ చేయడానికి బదులుగా,వాటిని ఒక్కొక్కటిగా నిల్వ చేయండి. ఇలా చేస్తే పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.ఒక అరటిపండు పండినా లేదా చెడిపోయినా, అది మిగిలినవి కూడా పక్వానికి లేదా చెడిపోవడానికి కారణమవుతుంది. అందుకే అన్నింటిని కలిపి ఉంచవద్దు

మార్కెట్ నుండి అరటిపండు కొన్న తర్వాత,మీరు దాని కాండాన్ని దేనితోనైనా చుట్టిపెట్టండి. ఇలా చేస్తే అవి త్వరగా చెడిపోవు. నిజానికి, అరటిపండు కాండం ఇథిలీన్ వాయువును విడుదల చేస్తుంది, ఇది అరటిపండు వేగంగా పండించడానికి సహాయపడుతుంది. మీరు కాండాన్ని ప్లాస్టిక్ చుట్టు లేదా అల్యూమినియం రేకుతో చుట్టిపెడితే అరటిపండు ఎక్కువసేపు తాజాగా ఉంటుంది. ఈ పద్ధతి అరటిపండును ఒక వారం వరకు తాజాగా ఉంచుతుంది.

అరటిపండ్లు చెడిపోకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే వాటిని బహిరంగ ప్రదేశంలో నిల్వ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచవచ్చు.వాటిని పండ్ల బుట్టలో లేదా వేలాడే హోల్డర్‌లో ఉంచవచ్చు.అరటిపండ్లను ఎప్పుడూ పెట్టెలో లేదా ప్లాస్టిక్ సంచిలో నిల్వ చేయకూడదు.దీనివల్ల అవి త్వరగా చెడిపోతాయి.

(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)




