Mosquito: రూపాయి ఖర్చు లేకుండా సహజంగా దోమలను తరిమే చిట్కాలు.. ఈ రోజు నుంచే ట్రై చేయండి
పగటి ఉష్ణోగ్రతలు హడలెత్తిస్తున్నాయి. ఇక రాత్రివేళ దోమలు బెదడ మరింత చికాకుకు పెట్టిస్తాయి. దోమల బెడద పెరిగితే రాత్రి నిద్రకు కూడా భంగం కలుగుతుంది. కాబట్టి ఇంట్లో దోమలను తరిమికొట్టడం చాలా అవసరం. కానీ మార్కెట్‌లో లభించే దోమల నివారణలు నుంచి వెలువడే పొగ, వాసనను చాలా మంది తట్టుకోలేరు. ఇలాంటి వారు దోమలను సహజపద్ధతుల్లో తరిమికొట్టే మార్గాలను ఇక్కడ తెలుసుకోవచ్చు..
Updated on: May 08, 2024 | 8:51 PM

Mosquito Bites

కానీ మార్కెట్‌లో లభించే దోమల నివారణలు నుంచి వెలువడే పొగ, వాసనను చాలా మంది తట్టుకోలేరు. ఇలాంటి వారు దోమలను సహజపద్ధతుల్లో తరిమికొట్టే మార్గాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

దోమల వాసనతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. బదులుగా, ఇంట్లో కర్పూరాన్ని వెలిగించవచ్చు. కర్పూరం కాల్చడం వల్ల ఇంట్లో పెద్దగా పొగ రాదు. ఈ పొగకు దోమలు పారిపోతాయ్. పైగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి కూడా కర్పూరం ఎంతో మేలు చేస్తుంది.

లేత రంగు దుస్తులు ధరించడం ద్వారా కూడా దోమలను మోసం చేయవచ్చు. ముదురు రంగులు దోమలను ఆకర్షిస్తాయి. దోమలు శరీరంలో బహిర్గతమైన భాగాలను ఎక్కువగా కుడతాయి. కాబట్టి లేత రంగు దుస్తులు ధరించడం మంచిది. అలాగే ఇంటి చుట్టూ మొక్కలు ఉంటే దోమల బెడద మరింత పెరుగుతుంది. కాబట్టి సకాలంలో కలుపు మొక్కలను తొలగించడం మంచిది. ఇంటి నాలుగు వైపులా ఎక్కడా నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

యూకలిప్టస్, వేప, లావెండర్, దాల్చినచెక్క, థైమ్ వంటి అనేక సహజ నూనెలు దోమలను తరిమికొడతాయి. మీరు ఈ నూనెను శరీరానికి అప్లై చేయవచ్చు. లేదంటే బట్టలు లేదా ఇంటి మూలలలో వేసినా దోమల బెడద వదిలిపోతుంది.




