AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలూ బీకేర్‌ఫుల్.. పెళ్లి చేసుకునే ముందు అబ్బాయిల్లో ఈ 4 క్వాలిటీస్‌ని చెక్ చేసుకోండి..

సరైన వయస్సులో పెళ్లి చేసుకోవడం కంటే.. సరైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలా సార్లు మనం భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటాం.. దాని ఫలితం కొన్ని సంవత్సరాల తర్వాత విచారంగా, కోలుకోలేని సమస్యగా మారి.. విడాకుల రూపంలో కనిపిస్తుంది. అయితే.. మంచి జీవిత భాగస్వామిని కనుగొనడం అనేది ఒక కల.. దానిని సాకారం చేసుకునేందుకు చాలా మంది పలునిర్ణయాలు తీసుకుంటారు. వివాహంలో అదృష్టం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావించినప్పటికీ, తమకు సరైన అబ్బాయిని ఎన్నుకునేటప్పుడు.. అమ్మాయిలు చాలా తప్పులు చేస్తారు.

Shaik Madar Saheb
|

Updated on: Feb 18, 2024 | 11:41 AM

Share
సరైన వయస్సులో పెళ్లి చేసుకోవడం కంటే.. సరైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలా సార్లు మనం భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటాం.. దాని ఫలితం కొన్ని సంవత్సరాల తర్వాత విచారంగా, కోలుకోలేని సమస్యగా మారి.. విడాకుల రూపంలో కనిపిస్తుంది.  అయితే.. మంచి జీవిత భాగస్వామిని కనుగొనడం అనేది ఒక కల.. దానిని సాకారం చేసుకునేందుకు చాలా మంది పలునిర్ణయాలు తీసుకుంటారు. వివాహంలో అదృష్టం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావించినప్పటికీ, తమకు సరైన అబ్బాయిని ఎన్నుకునేటప్పుడు.. అమ్మాయిలు చాలా తప్పులు చేస్తారు. ముఖ్యంగా ఒక అమ్మాయి ఎవరితోనైనా ప్రేమలో ఉన్నప్పుడు, ఆమె తన భాగస్వామితో చాలా అటాచ్ అవుతుంది. అతని మంచి, తప్పుడు అలవాట్ల మధ్య తేడా ఆమెకు చాలా విషయాలు అర్ధం కావు.. ఆమె కొన్ని పరిస్థితుల్లో.. ఏ షరతుతోనైనా అతనితో మూడుముళ్లు వేయించుకోవడానికి అంగీకరిస్తుంది. అటువంటి పరిస్థితిలో.. మీరు మీ బాయ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఈ విషయాలను నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఆ క్వాలిటీస్ ను చెక్ చేసుకున్న తర్వాతే.. ప్రొసీడ్ అవ్వడం మంచిదంటున్నారు మానసిక నిపుణులు.. అవేంటో తెలుసుకోండి..

1 / 6
తప్పులను బట్టి అంచనా వేయొద్దు: వాస్తవానికి సమాజంలో.. ఎవరూ పరిపూర్ణులు కాదు. తప్పులు ఎవరైనా చేస్తారు.. అటువంటి పరిస్థితిలో, మంచి జీవిత భాగస్వామి తన భాగస్వామి లోపాలను అంగీకరించి, వాటి ఆధారంగా అతనిని అంచనా వేయాలి.. ఒక వ్యక్తి లోపాలను ఇతరుల నుంచి భిన్నంగా ఉండేలా చేయడం, దాని ప్రకారం ఆలోచించడం చాలా ముఖ్యం..

2 / 6
విషయాలను బహిరంగంగా మాట్లాడేవారు: బలమైన సంబంధం కోసం, మీ ఆలోచనలను బహిరంగంగా పంచుకోవడం, సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడటం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, మీరు మీ భావాలను మీ బాయ్‌ఫ్రెండ్‌తో సులభంగా పంచుకోగలిగితే, అతను మీరు చెప్పేది సులభంగా వింటాడు. వీటన్నింటిని అర్థం చేసుకుంటే, అతను మీకు మంచి జీవిత భాగస్వామిగా నిరూపించుకోవచ్చు.

3 / 6
మద్దతును అందించి భరోసానిచ్చేవారు: మీ భాగస్వామి సులభంగా పరిస్థితులకు అనుగుణంగా, మీతో జీవితాన్ని గడపడానికి విషయాల్లో రాజీ పడటానికి సిద్ధంగా ఉంటే, మీరు అతనిని వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకోవచ్చు. అలాంటి వారితో జీవితం చాలా సాఫీగా గడిచిపోతుంది. ఎందుకంటే మీరు ప్రతి విషయంలో వారి మద్దతును పొందుతారు.

4 / 6
లక్ష్యాలను సాధించేందుకు సహాకారం అందిచేవారు: మీ కలలకు మద్దతిచ్చి, మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడి, మీ విజయాలను తన విజయం భావించే వ్యక్తి మంచి భాగస్వామి. మీ బాయ్‌ఫ్రెండ్ మీ కోసం ఇవన్నీ చేస్తే, అతను మీకు గొప్ప జీవిత భాగస్వామిగా నిరూపించుకోవచ్చు..

5 / 6
ఏదీఏమైనప్పటికీ.. అందరినీ మెప్పించి పెళ్లి చేసుకోవడం.. పెద్దలను గౌరవించడం మంచిది. ఎందుకంటే.. కుటుంబం నుంచి సహాయ సౌకర్యాలను పొందవచ్చు.. వారికి కుటుంబం అండగా ఉంటుంది.. ఇవన్నీ గమనించి పెళ్లి చేసుకోవడం మంచిది.

6 / 6