వారసత్వం అంటే కేవలం కొడుకులు మాత్రమే కాదు కూతుళ్లు కూడా..! కాకపోతే ఇండస్ట్రీలో వారసురాళ్ల కంటే వారసులే ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటారు. అందుకే మాకేం తక్కువా.. మేమేం తక్కువా అంటూ డాటర్స్ ఇప్పుడు డైరెక్ట్ అటాక్‌కు దిగుతున్నారు. దానికోసం తమ తండ్రులను తెరమీదకి తీసుకొస్తున్నారు. చిరు, రజినీతో పాటు బాలయ్య ఇందులో జాయిన్ అయ్యారిప్పుడు.