AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Heroes: బాలీవుడ్‌లోనూ మన జెండా.. మన హీరోలు కోసం హిందీ దర్శకులు క్యూ..

అక్కడ కూడా మన డామినేషనే అంటావా..? అదుర్స్‌లో బ్రహ్మానందం చెప్పిన ఈ డైలాగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడిదే జరుగుతుంది. నిజమండీ బాబూ.. బాలీవుడ్‌లోనూ మన జెండా ఎగురుతుంది. పాన్ ఇండియన్ మార్కెట్ ఓపెన్ అయ్యాక.. నార్త్ హీరోలకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు మన హీరోలు. అదెలాగో ఈ స్టోరీ చూసేయండి తెలుస్తుంది. పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలయ్యాక బాలీవుడ్ హీరోలకు తెలియని వణుకు మొదలైపోయింది. 

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Feb 18, 2024 | 11:40 AM

Share
హిందీ హీరోల స్థానాన్ని మన హీరోలు కబ్జా చేస్తున్నారనే విషయం వాళ్ళకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అయినా కూడా వాళ్లు ఏం చేయలేకపోతున్నారు. పైగా బాలీవుడ్ బడా దర్శకులు కూడా మన హీరోలే కావాలంటున్నారు.. మన వాళ్ళతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.

1 / 5
సౌత్, నార్త్ వర్కవుట్ అయ్యేలా పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమా చేయాలంటే టాలీవుడ్ స్టార్ హీరోలను మించిన ఆప్షన్ మరోటి బాలీవుడ్ దర్శకులకు కనిపించడం లేదు. అందుకే ఆదిపురుష్ ఏరికోరి ప్రభాస్‌తో చేసారు ఓం రౌత్. ప్రభాస్ కోసమైతే క్యూ కడుతున్నారు బాలీవుడ్ మేకర్స్. ఆయన డేట్స్ ఇస్తే చాలు అనుకుంటున్నారు.

2 / 5
ఇక ఇప్పుడు నార్త్‌లో ఉన్న స్టార్స్ అందరినీ కాదని.. వార్ 2 కోసం హృతిక్ రోషన్‌కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకున్నారు అయన్ ముఖర్జీ. అయితే ఈ చిత్రం షూటింగ్ లో తారక్ ఎప్పటినుంచి పాల్గొననున్నారు చూడాలి.

3 / 5
మరోవైపు అల్లు అర్జున్ పుష్ప పూర్తి చేస్తే.. ముంబైకి కిడ్నాప్ చేసేలా ఉన్నారు అక్కడి నిర్మాతలు. రామ్ చరణ్ కూడా ఏం తక్కువ కాదు.. ఈయన కోసం ఏకంగా సంజయ్ లీలా భన్సాలీ కథ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

4 / 5
11వ శతాబ్దపు రాజు సుహేల్ దేవ్ బయోపిక్‌ను చరణ్‌తో భన్సాలీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పీరియాడిక్ సినిమాలు చేయడంలో భన్సాలీకి తిరుగులేదు. చరణ్‌తోనూ ఇలాంటి భారీ పీరియాడిక్ మూవీనే ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. పదేళ్ళ కిందే జంజీర్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ట్రిపుల్ ఆర్‌తో మార్కెట్ పెంచుకున్నారు. మొత్తానికి మన హీరోల పుణ్యమా అని.. బాలీవుడ్ బడా స్టార్స్‌కు నిద్ర కరువైపోతుంది.

5 / 5
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...

వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..

ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే

30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప

రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?

ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..

మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే