ప్రస్తుత కాలంలో మనుషులను గుండె సమస్యలు వెంటాడుతున్నాయి.. దీనికి ప్రధాన కారణం పేలవమైన జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి.. అందుకే.. ఆరోగ్యంగా ఉండేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోవడం ముఖ్యం.. గుండె సమస్యల్లో హార్ట్ బ్లాక్ (Heart Blockage) ఒకటి.. గుండె పైగది నుండి విద్యుత్ సంకేతాలు గుండె దిగువ గదికి సరిగ్గా చేరుకోనప్పుడు హార్ట్ బ్లాక్ ఏర్పడుతుంది. హార్ట్ బ్లాక్ ను.. అట్రియోవెంట్రిక్యులర్ (AV) బ్లాక్ లేదా కండక్షన్ డిజార్డర్ అని కూడా పిలుస్తారు. ఇది గుండె కండరాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసే కొరోనరీ ధమనులలో రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడాన్ని సూచిస్తుంది.