- Telugu News Photo Gallery Follow these tips and red lips will be yours, check here is details in Telugu
Lip Care Tips: పెదాలు నల్లబడిపోతున్నాయా.. వీటిని పాటిస్తే ఎర్రగా మెరిసిపోతాయి..
అమ్మాయిల ముఖంలో ఎక్కువగా ఎట్రాక్ట్ చేసేవి.. పెదాలే. ఆ పెదాలే అందంగా లేకుంటే.. అంత లుక్ రాదు. కొంత మందికి నేచురల్‌గానే పెదాలు ఎర్రగా ఉంటాయి. కానీ మరికొంత మందికి మాత్రం.. నల్లబడి పోతూ ఉంటాయి. శరీరంపై పెట్టే శ్రద్ధ ఎక్కువగా పెద్దాలపై పెట్టరు. లిప్ కేర్ అనేది చాలా అవసరం. నల్లగా ఉండే పెదాలను ఎర్రగా మార్చడంలో ఈ చిట్కాలు బాగా ఉపయోగ పడతాయి. ప్రతి రోజూ బీట్ రూట్ రాయడం వల్ల పెదాలు పింక్ రంగులోకి మారతూ ఉంటాయి. మంచి నిగారింపు కూడా వస్తుంది. వీటిల్లో బీటాలెన్స్..
Updated on: May 06, 2024 | 4:53 PM

అమ్మాయిల ముఖంలో ఎక్కువగా ఎట్రాక్ట్ చేసేవి.. పెదాలే. ఆ పెదాలే అందంగా లేకుంటే.. అంత లుక్ రాదు. కొంత మందికి నేచురల్‌గానే పెదాలు ఎర్రగా ఉంటాయి. కానీ మరికొంత మందికి మాత్రం.. నల్లబడి పోతూ ఉంటాయి. శరీరంపై పెట్టే శ్రద్ధ ఎక్కువగా పెద్దాలపై పెట్టరు. లిప్ కేర్ అనేది చాలా అవసరం.

నల్లగా ఉండే పెదాలను ఎర్రగా మార్చడంలో ఈ చిట్కాలు బాగా ఉపయోగ పడతాయి. ప్రతి రోజూ బీట్ రూట్ రాయడం వల్ల పెదాలు పింక్ రంగులోకి మారతూ ఉంటాయి. మంచి నిగారింపు కూడా వస్తుంది. వీటిల్లో బీటాలెన్స్ ఉంటుంది. ఇవి పెదాల రంగును కాపాడతాయి.

కీరాతో ముఖ సౌందర్యాన్నే కాకుండా.. పెదాల నల్లధనాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఎ, సిలు.. పెదాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రతి రోజూ కీరా రసాన్ని పెదాలకు రాయడం వల్ల.. ఎర్రగా మారతాయి.

అదే విధంగా పంచదారతో కూడా పెదాల నలుపును పోగొట్టుకోవచ్చు. పంచదారతో పెదాలపై సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి.. రంగు మారతాయి.

పంచదార, తేనె, మీగడతో కూడా పెదాలను సాఫ్ట్‌గా, పింక్ రంగులోకి మార్చుకోవచ్చు. పెదాలకు కూడా మాయిశ్చ రైజర్ అనేది చాలా అవసరం. దీని వల్ల పెదాలు పగలగుండా ఉంటాయి. పెదాలకు కూడా ప్రత్యేకంగా లిప్ కేర్ తీసుకోవాలి.




