భారతదేశంలో ప్రతి సంవత్సరం గుండెపోటు కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు.. కాబట్టి ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మన దేశంలో, ప్రజలు ఎక్కువ నూనె, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఇది రుచికరంగా ఉండవచ్చు.. కానీ గుండె ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. కొవ్వును పెంచడంతోపాటు.. బీపీ.. గుండె సమస్యలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో వాల్ నట్స్ తినడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.. వాల్నట్స్లో ఫైబర్, విటమిన్ ఇ, ఫోలేట్, మెగ్నీషియం, పాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెంచడంలో, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి..