రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి అధిక శరీర బరువును నియంత్రించడం వరకు బే ఆకులు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. బే ఆకులను నీటిలో నానబెట్టి తాగొచ్చు లేదంటే నీళ్లలో ఉడకబెట్టి అయినా తీసుకోవచ్చు. వేగవంతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి బే ఆకులను నానబెట్టి తీసుకోవడం ఉత్తమం. ఈ పానీయం జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది.